Begin typing your search above and press return to search.

బేసిక్ స్టైల్ తోనే కుమ్మేస్తున్న కొండ‌

By:  Tupaki Desk   |   14 Aug 2022 3:30 AM GMT
బేసిక్ స్టైల్ తోనే కుమ్మేస్తున్న కొండ‌
X
VD ఏం చేసినా అది సంథింగ్ స్పెష‌ల్ గా మారుతోంది. ముఖ్యంగా అత‌డి ఫ్యాష‌న్ అనుక‌ర‌ణ‌లు ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో ర‌ణ‌వీర్ సింగ్ త‌ర‌హాలో టాలీవుడ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ ..! అంటూ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ అవాయ్ చెప్పులకు ద‌క్కిన ప్ర‌మోష‌న్ గురించి తెలిసిందే. లైగ‌ర్ ట్రైల‌ర్ ఈవెంట్లో అత‌డు ఇత‌రుల ఊహకు అంద‌ని రీతిలో అవాయ్ చెప్పుల‌తో స్టేజీపై ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. దానిపై స్టైల్ గురూ ర‌ణ‌వీర్ సింగ్ సైతం ప్ర‌శంస‌లు కురిపించాడు. విజ‌య్ ఏం చేసినా అది ట్రెండ్ సెట్ట‌ర్ గా మారుతోంది.

ఇప్పుడు అత‌డు చెన్నైలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. అక్క‌డ ప్ర‌మోష‌న్స్ కోసం రెడీ అయ్యాడు. అక్కడా అత‌డు ట్రెండ్ సెట్ట‌రే అయ్యాడు. విజయ్ దేవరకొండ ప్రమోషన్ల కోసం చెన్నై విమానాశ్రయానికి వచ్చినప్పుడు వైట్ టీష‌ర్ట్- లెదర్ జాకెట్ తో బేసిక్ లుక్ లో కనిపించాడు. త‌న లైగ‌ర్ సినిమాని ప్రమోట్ చేయడానికి అలాగే దేశం నలుమూలలా ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడానికి లైగర్ టీమ్ ఎలాంటి అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌డం లేదు.

ఈ చిత్రం ఆగస్ట్ 25న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతుండ‌గా ప్ర‌చారం హోరెత్తిస్తున్నారు. ఇప్ప‌టికే మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేయ‌డం లో దేవ‌ర‌కొండ టీమ్ స‌క్సెసైంది. ఇప్పుడు ఊర‌మాస్ అర‌వ‌తంబీల‌ చెన్నైకి కూడా లైగ‌ర్ త‌న స్టైల్ కంటెంట్ ని ప‌రిచ‌యం చేస్తున్నాడు. చెన్నై ప్ర‌మోష‌న్స్ లో సూపర్ కూల్ అండ్ క్యాజువల్ లుక్ లో క‌నిపించిన దేవ‌ర‌కొండ‌పై ఫోటోగ్రాఫ‌ర్లు వ‌రుస‌ క్లిక్ ల‌తో హోరెత్తించారు. విజయ్ దేవరకొండ బ్లాక్ జాగర్ ప్యాంట్ .. వైట్ టీ ష‌ర్ట్ కాంబినేష‌న్ గా లెదర్ జాకెట్‌ తో సాధారణంగానే క‌నిపించాడు. అత‌డు వైట్ స్నీకర్లతో సౌకర్యవంతమైన టచ్ ని ఈ లుక్ కి ఇచ్చాడు.

ఇప్ప‌టికే లైగ‌ర్ ట్రైల‌ర్ తో పాటు పోస్ట‌ర్లు.. మూడు పాటలు అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. అక్డి పక్డి - వాట్ లగా దేంగే - ఆఫత్ - కోకా 2.0 పాట‌లు ప్రేక్షకులలోకి చేరువ‌య్యాయి. రామ్ మిరియాల- గీతా మాధురి ఆల‌పించిన కోకా 2.0 సైతం మాస్ కి క‌నెక్ట‌య్యింది. ఈ పాట‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించారు.

గ‌ల్లీ నుంచి వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ అయ్యే వ‌ర‌కూ సాగిన ఒక ఫైట‌ర్ ప్ర‌య‌త్నంపై సినిమా ఇది. ముంబై మురికివాడ‌ ధారావికి చెందిన‌ యువ‌కుడిగా ఫైట‌ర్ గా విజ‌య్ ఈ చిత్రంలో న‌టించారు. అత‌డి ప్రియురాలిగా అన‌న్య క‌నిపించ‌నుంది. సినిమా తారాగణం విషయానికి వస్తే.. ఈ పాన్ ఇండియా చిత్రంలో విజయ్ దేవరకొండ - అనన్య పాండేతో పాటు రమ్య కృష్ణన్- రోనిత్ రాయ్- విషు రెడ్డి- మకరంద్ దేశ్ పాండే - గెటప్ శ్రీను కూడా ఇతర కీలక పాత్రలు పోషించారు. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కూడా `లైగర్‌`లో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.