ఊర మాస్ అవతారంలో నేచురల్ స్టార్

Sat Mar 19 2022 17:02:03 GMT+0530 (India Standard Time)

latest news about nani new movie dasara

నేచురల్ స్టార్ నాని మళ్లీ స్పీడు పెంచేశారు. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలని అందించి విజయాల్ని సొంతం చేసుకున్న హీరో నాని `శ్యామ్ సింగ రాయ్` సూపర్ హిట్ తో మంచి జోష్ మీదున్నారు. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్న ఆయన ఇప్పటికే `అంటే సుందరానికి` చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ కి రెడీ అయిపోయారు. ఈ మూవీ తరువాత నాని నటిస్తున్న ఊర మాస్ మసాలా ఎంటర్ టైనర్ `దసరా`. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం ద్వారా దర్‌శకుడిగా పరిచయం అవుతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ గ్లింప్స్ ని దసరా రోజు చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో బీయర్డ్ తో నెవర్ బిఫోర్ అవతార్ లో ఊర మాసీవ్ గా నాని కనిపించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా ఈ వీడియోలో నాని చెప్పిన తెలంగాణ స్లాంగ్ లో నాని చెప్పిన డైలాగ్ లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గోదావరిఖని సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో సాగే పక్కా మాస్ ఎంటర్ టైనర్ ఇది.

ఇందులో గల్లా లుంగీ ధరించి ఊర మాస్ అవతార్ లో నేచురల్ స్టార్ నాని కనిపించబోతున్నారు. ఆయన పాత్రని మలిచిన తీరు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. జమ్మి పెట్టి చెప్తాన్నా ఒక్కొడికి ఇక బద్దల్ బాసింగాలే.. అంటూ దసరా సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో నాని చెప్పిన డైలాగ్స్ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా వుండబోతోందో స్పష్టం చేసింది. ఈ వీడియో ఎండింగ్ లో రైలు పొగని మ్యాచ్ చేస్తూ నాని హెడ్ ని ఫైనల్ గా చూపించాడు దర్శకుడు. లాంగ్ బీయర్డ్ తో నాని మాసీవ్ లుక్ ఆకట్టుకుంటూ సినిమా ఓ రేంజ్ తో వుంటుందనే సంకేతాల్ని అందించింది.

తాజాగా ఈ చిత్ర బృందం ఓ పోస్టర్ ని శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో గల్లలుంగీ కట్టుకుని నాని వెళుతున్నట్టు కాళ్లు మాత్రమే చూపించారు. ముందు  రెండు లిక్కర్ బాటిల్స్ వేళాడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. కాళ్లకి వేసుకున్న స్లిప్పర్స్ మసికొట్టుకుని పోయి కనిపిస్తున్నాయి. అంటే ఈ చిత్రంలో నాని మాస్ ఆడియన్స్ కి దసరా చూపించబోతున్నాడని క్లారిటీగా తెలుస్తోంది.  

స్పార్క్ ఆఫ్ దసరా ని ఆదివారం ఉదయం 11: 34 నిమిషాలకు విడుదల చేస్తున్నామని తాజా పోస్టర్ లో మేకర్స్ ప్రకటించారు. అంతే ఆదివారం నాని మాస్ విశ్వరూపాన్ని చూపించబోతున్నారన్నమాట. ఈ మూవీ కోసం ఇటీవల 12 కోట్ల భారీ బడ్జెట్ తో 12 ఎకరాల స్థలంలో విలేజ్ సెట్ ని నిర్మించారట.

ఇందులోనే కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.