Begin typing your search above and press return to search.

థియేట‌ర్లేనా.. థ్రిల్లివ్వ‌డంలో ఓటీటీ ఎక్క‌డా త‌గ్గదు!

By:  Tupaki Desk   |   15 Sep 2021 1:30 AM GMT
థియేట‌ర్లేనా.. థ్రిల్లివ్వ‌డంలో ఓటీటీ ఎక్క‌డా త‌గ్గదు!
X
నిన్న.. మొన్న‌టివ‌ర‌కూ ఓటీటీ బాట ప‌ట్టిన సినిమాలు ఇప్పుడు థియేట‌ర్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఓటీటీతో పాటు థియేట‌ర్లోనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నిర్మాత‌లు ఎవ‌రి ఇష్టం మేర‌కు రిలీజ్ వేదిక‌ల్ని ఎంపిక చేసుకుంటున్నారు. కంటెంట్ ఏదైనా ప్లాట్ ఫామ్ తో సంబంధం లేకుండా ఆ సినిమాల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తాజాగా ఈ వారంలో ఓటీటీ థియేట‌ర్లో రిలీజ్ అయ్యే సినిమాల గురించి ఓ లుక్ వేస్తే..

సందీప్ కిషన్- నేహా శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం `గ‌ల్లీరౌడీ`. ఈ చిత్రానికి జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అన్ని ప‌నులు పూర్తి చేసుకున్న సినిమా సెప్టెంబ‌ర్ 17న థియేట‌ర్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్ర‌చార చిత్రాలు ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. యంగ్ హీరో సందీప్ కిష‌న్ స‌రైన స‌క్సెస్ అందుకుని చాలా కాల‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో విజ‌యం అనివార్య‌మైన స‌మ‌యం కూడా ఇది. స‌క్సెస్ అత‌ని ఫేట్ ని మార్చే అవ‌కాశం ఉంది. ఇక `బిచ్చ‌గాడు` ఫేం విజ‌య్ ఆంటోనీ న‌టించిన చిత్రం `విజ‌య్ రాఘ‌వ‌న్`. ఆనంద్ కృష్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

విజ‌య్ సినిమాల‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అత‌ని కంటెంట్ కి టాలీవుడ్ ఆడియ‌న్స్ క‌నెక్ట్ అవుతుంటారు. ఈ నేప‌థ్యంలో సినిమాకి మంచి టాక్ వ‌స్తే గ‌నుక విజ‌య్ కెరీర్ కి ప్ల‌స్ కానుంది. సెప్టెంబ‌ర్ 17న థియేట‌ర్లో రిలీజ్ అవుతుంది. ఇదే రోజున మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్- యాక్ష‌న్ కింగ్ అర్జున్ న‌టించిన `ఫ్రెండ్ షిప్` కూడా రిలీజ్ అవుతుంది. సింగ్-కింగ్ ల ప్రెండ్ షిప్ స్టోరీ నేప‌థ్యంలో అంచ‌నాలు బాగానే ఉన్నాయి. జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక ఓటీటీలో యూత్ స్టార్ నితిన్ న‌టించిన `మాస్ట్రో` కూడా సెప్టెంబ‌ర్ 17న రిలీజ్ అవుతుంది. డిస్నీ హాట్ స్టార్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

ఇందులో త‌మ‌న్నా.. న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రానికి మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోలీవుడ్ హీరో విజ‌య్ సేతుప‌తి న‌టించిన అన‌బెల్ సేతుప‌తి కూడా ఇదే రోజున డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంది. ఇందులో తాప్సీ హీరోయిన్ కాగా... దీప‌క్ సుందర‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అలాగే సుశాంత్-మీనాక్షి చౌద‌రి జంట‌గా న‌టించిన `ఇచ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు` చిత్రం కూడా సెప్టెంబ‌ర్ 17న ఆహాలో రిలీజ్ అవుతుంది. ఇంకా మ‌రికొన్ని హాలీవుడ్ కి చెందిన చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.

`డోర్ అండ్ మీ`.. `అన్ హియ‌ర్డ్`..`క‌న్సెష‌న్స్ ఆఫ్ ఏ షోఫాహోలిక్`.. `అన్ క‌హీ కహానియా`.. `ప్రియురాలు` చిత్రాలు సెప్టెంబ‌ర్ 17న వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్ ల్లో రిలీజ్ అవుతున్నాయి. అలాగే `వీడ్స్`..`నైట్ బుక్స్`.. సెప్టెంబ‌ర్ 15న ..`సెర్చింగ్` సెప్టెంబ‌ర్ 14న‌.. `అజ్ ఎబౌ సో బిలో`..` బుక్ మై షో` చిత్రాలు సెప్టెంబ‌ర్ 16న ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. అలాగే `స‌ర్వైవ‌ర్` అనే రియాల్టీ షో నెట్ ప్లిక్స్ లో సెప్టెంబ‌ర్ 17న రిలీజ్ అవుతుంది.

ఇటీవ‌లి కాలంలో థియేట్రిక‌ల్ రంగానికి ఓటీటీ రంగానికి న‌డుమ అనివార్య‌మైన పోటీ న‌డుస్తోంది. ఈ వార్ లో ఓటీటీలు గ‌ట్టి ప‌ట్టు ప‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. దీనివ‌ల్ల ఎగ్జిబిష‌న్ రంగం తీవ్ర సంక్షోభంలో ప‌డాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. ఓటీటీల‌పై ఇప్ప‌టికే ఎగ్జిబిట‌ర్ల నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.