ఉప్పెన పాప.. ఇలా అయితే ఎలా?

Sat Aug 13 2022 06:00:02 GMT+0530 (IST)

krithi shetty movie news

ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయమైన కృతి శెట్టి మొదట్లోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో తన స్థాయిని పెంచుకుంది. మొదటి సినిమా విడుదల కాకముందే ఈ బ్యూటీ రెండు సినిమాలకు సైన్ చేసింది. ఉప్పెన షూట్ లో ఉండగానే కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. అలా తన పాపులారిటీని పెంచుకున్న కృతి శెట్టి ఉప్పెన తరువాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.ఆ సినిమాలో ఆమె పాత్ర పెద్దగా లేకపోయినప్పటికీ సినిమా సక్సెస్ అయ్యింది కాబట్టి తన రేంజ్ కూడా పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన బంగార్రాజు సినిమా కమర్షియల్గా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడి వెనక్కి తేవడంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుసగా లవ్ కమర్షియల్ సినిమాలు సక్సెస్ కావడంతో తమ్ముడు మరిన్ని అవకాశాలు వచ్చాయి.

రెండో సినిమాకే కోటికి పైగా డిమాండ్ చేసిన కృతి ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలోనే కమర్షియల్ సినిమాలకు డిమాండ్ చేసింది. రామ్ పోతినేని తో ఒకే సారి తెలుగు తమిళంలో చేసిన సినిమా ది వారియర్. ఆ సినిమా సక్సెస్ అయితే అటు తమిళంలో కూడా బిజీ అవ్వాలని ప్రణాళికలు రచించింది. కానీ అది వర్కౌట్ కాలేకపోయింది. ఇటీవల వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది.

ఈ సినిమాలో కూడా కృతి తన పాత్రకు ప్రాధాన్యత లేకుండా నటించడం ఆమె అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. మొదటి రెండు సినిమాలతో వచ్చిన క్రేజ్ ఇప్పుడు వచ్చిన సినిమాలతో ఆమె డిమాండ్ ను మరింత తగ్గిస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో కృతి ఏదో పాటలకే పరిమితం చేయడం సరిపోయింది.

దర్శకుడు ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి ఎదో మ్యాజిక్ క్రియేట్ చేస్తారు అనుకుంటే రొటీన్ కమర్షియల్ ఫార్ములకు ఏ మాత్రం తక్కువ కాకుండా తన ఎడిటర్ తెలివిని వడాడు. కానీ కంటెంట్ లో పస లేకుంటే స్క్రీన్ ప్లే తో ఎంత మ్యాజిక్ చేసినా వర్కౌట్ కాదని అర్ధమయ్యింది. చాలా సన్నివేశాలతో చిరాకు తెప్పించాడు. ఏదేమైనప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద కృతి దారుణమైన డిజాస్టర్ ఎదుర్కోనుంది. మరి రాబోయే ప్రాజెక్టులు ఏమవుతాయో చూడాలి.