బేబమ్మ దిల్ 'ఖుషీ'.!

Mon Dec 05 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

krithi shetty key role in kushi movie

కన్నడ సొంపుల సోయగం కృతి శెట్టి వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. తొలి చిత్రంతోనే తెలుగు తెరపైకి ఉప్పెన లా దూసుకొచ్చిన ఈ చిన్నది అదే సనిమాలో తన అందం అభినయంతో బేబమ్మగా కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టారు. తరువాత వరుసగా హిట్ చిత్రాల్లో నటిస్తూ దూసుకెళుతున్నారు. తాజాగా ఆమెకు మరో బంపర్ ఆఫర్ వరించింది. విజయ్‌దేవరకొండ సమంతలు జోడిగా నటిస్తున్న సినిమాలో బేబమ్మ ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో కృతి శెట్టిని కూడా చిత్ర యూనిట్ ఎంపిక చేసింది. సినిమాలో ఆమె పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.క్యూట్ అందాల కృతి శెట్టి సౌత్ ఇండియాలో  ప్రస్తుతమున్న అందమైన హీరోయిన్లలో కెల్లా ప్రత్యేకమైది. వచ్చి రాగానే  తాను నటించిన మూడు సినిమాలకు హిట్ టాక్ రావడంతో హ్యాట్ ట్రిక్ హిట్‌లను తన ఖాతాలో వేసుకొంది. ఆ స్టార్‌డమ్ ఆమెకు కలిసి వస్తోంది. తరువాత ఆమెకు చెప్పుకోదగ్గ విజయాలు లేకపోయినా సరే ఆమెకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. చేతినిండ వరుసబెట్టి చేయాల్సిన సినిమాలున్నాయి. కొత్త సినిమాలు వచ్చి పడుతున్నాయి.

ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న ఈ బామ మూడు వరుస సినిమాల విజయం తరువాత ది వారియర్ మూవీతో తొలి ప్లాప్‌ను అందుకుంది. హ్యాట్రిక్ హిట్ గాళ్‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడికి వరుస ప్లాపులు వెక్కరించినా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. తాజాగా విజయ్‌దేవరకొండ సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది. దీంతో కృతికి టైం బాగానే ఉందని అనుకుంటున్నారు ఆమె అభిమానులు.

లైగర్‌తో పెద్ద డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ తదుపరి సమంత కాంబినేషన్‌లో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. శివ దర్శకత్వంలో  తీస్తున్న ఈ సినిమాకు ఖుషీగా నామకరణం చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. విజయ్ దేవర కొండ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పుడు ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం కృతి శెట్టిని ఎంపిక చేసుకుంది చిత్ర యూనిట్. సమంత విజయ్‌దేవరకొండల సినిమాలో నటించే ఛాన్స్ తలుపు తట్టడంతో బేబమ్మ దిల్ ఖుషీ అవుతున్నారట.  ఇవి కాకుండా నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న బై లింగ్వల్ మూవీలోనూ కృతి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాపై బేబమ్మ బోలెడు ఆశలు పెట్టుకుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.