Begin typing your search above and press return to search.

సినిమా కోసం లైఫ్'ని లెక్కచేయని హీరో..!

By:  Tupaki Desk   |   27 May 2020 10:30 AM GMT
సినిమా కోసం లైఫ్ని లెక్కచేయని హీరో..!
X
సౌత్ స్టార్ హీరో విక్రమ్.. సినీ అభిమానులకు ఇది పరిచయం అవసరం లేని పేరు. తన విలక్షణ నటనతో దశాబ్దాల కాలంగా విక్రమ్ అభిమానులని అలరిస్తున్నాడు. విక్రమ్ సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు. సినిమా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా తనని తను మలుచుకుంటాడు. ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’ ఇలా తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశాడు. పాత్రకోసం విక్రమ్ రిస్క్ చేయడం ఇదేం కొత్త కాదు.

ప్రస్తుతం విక్రమ్ కోబ్రా అనే సినిమాలో నటిస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అజయ్ ఈ సినిమా గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. ఒక సన్నివేశం కోసం విక్రమ్ తన ప్రాణాలనే రిస్క్ లో పెట్టాడట. దాని గురించి చెప్తూ.. ఓ సన్నివేశంలో హీరో చేతుల, కాళ్ళు కట్టేసి ఉంటాయి. నోటికి కూడా గుడ్డ కట్టి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కాళ్ళని పైన కట్టేసి ఉండగా తల్ల కిందులుగా నీటిలో ముంచుతారు. అలా కొంత సమయం నీటిలోనే ఉండాలి. ముందుగా ఈ సన్నివేశాన్ని డూప్ తో చేయించాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ డూప్ కొన్ని సెకండ్ల కంటే ఎక్కువ సమయం భరించలేకపోయాడు.

షూట్ చేసిన వరకు చాలని, ఎడిటింగ్ లో మేనేజ్ చేద్దాం అని అనుకున్నాం. కానీ సీన్ పై విక్రమ్ సంతృప్తిగా లేడు. డూప్ అవసరం లేకుండా తానే చేయడానికి ముందుకు వచ్చాడు. శ్వాస తీసుకోవడం కష్టం అయినా సరే షాట్ ని పర్ఫెక్ట్ గా పూర్తి చేశాడు. ఆ మరుసటి రోజు నాకు తెలిసింది. నీటిలో తలకిందులుగా మునగడం వల్ల.. విక్రమ్ తలలోకి నీరు వెళ్లిందట.. నరాలకు ఇబ్బంది కలగడంతో విక్రమ్ చికిత్స చేయించుకున్నారు. అయినా కూడా మరుసటి రోజు షూటింగ్లో పాల్గొన్నాడు" అని అజయ్ తెలిపారు. గతంలో కాశి చిత్రంలో కూడా విక్రమ్ గుడ్డివాడిగా నటించాడు. అలా నటించడం వల్ల విక్రమ్ కంటి నరాలు దెబ్బతినడం, చికిత్స చేయించుకోవడం జరిగింది. శంకర్ ఐ చిత్రంలో కూడా అనూహ్యంగా బరువు తగ్గిన సంగతి తెలిసిందే. తన లైఫ్ రిస్క్ లో పెట్టి మరీ అభిమానులను అలరిస్తున్నాడంటే విక్రమ్ చాలా గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.