Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ లో కోల్ క‌త‌.. సెట్ కోస‌మే 6.5కోట్లు

By:  Tupaki Desk   |   18 April 2021 9:30 AM GMT
హైద‌రాబాద్ లో కోల్ క‌త‌.. సెట్ కోస‌మే 6.5కోట్లు
X
నేచురల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం `శ్యామ్ సింఘ‌రాయ్`. రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిహారికా ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన `ఫస్ట్ లుక్` పోస్టర్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. నాని వైవిధ్య‌మైన గెట‌ప్ తో పాటు పోస్ట‌ర్ లో ఎలివేట్ చేసిన ర‌హ‌స్యం క్యూరియాసిటీని పెంచింది.

ఈ సినిమాలో ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ ల‌తో నాని అద‌ర‌గొడ‌తాడ‌న్న టాక్ వినిపిస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా హైదరాబాద్ ఔట‌ర్ లోని 10 ఎకరాల్లో కోల్ కతా న‌గ‌రాన్ని భారీ సెట్ రూపంలో నిర్మించారు. దీనికోసం ఏకంగా 6.5కోట్లు ఖ‌ర్చు చేశార‌ని తెలిసింది. ఇందులోనే సినిమాకి సంబంధించిన‌ ముఖ్యమైన సన్నివేశాలను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాలు చాలా సంక్లిష్టమైనవి కీల‌క‌మైన‌వి కాబట్టి సెట్ కోసం అంత పెద్ద బడ్జెట్ ను ఖర్చు చేశారు. ఫైనల్ షెడ్యూల్ లో నాని కూడా పాల్గొంటార‌ని తెలిసింది.

ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతున్న‌ది. ట్యాక్సీవాలా లాంటి విభిన్న‌మైన కాన్సెప్టుతో మెప్పించిన రాహుల్ ఈసారి ఎంచుకున్న క‌థాంశం ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని చెబుతున్నారు. ముగ్గురు అందమైన కథానాయికలు నాని స‌ర‌స‌న న‌టిస్తున్నారు. సాయి పల్లవి- కృతి శెట్టి- మడోన్నా సెబాస్టియన్ ఇందులో నాయిక‌లు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో జిషు సేన్ గుప్తా- రాహుల్ రవీంద్రన్- మురళి శర్మ- అభినవ్ గోమ‌టం ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

సత్యదేవ్ జంగా క‌థ‌ను అందించారు. మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ సౌండ్ ట్రాక్ లను కంపోజ్ చేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ కెమెరా వ‌ర్క్ చేస్తున్నారు.