Begin typing your search above and press return to search.

RRR ప్ర‌మోష‌న‌ల్ బీట్ కోసం కొల‌వెరిడి సంచ‌ల‌నం!

By:  Tupaki Desk   |   21 July 2021 8:30 AM GMT
RRR ప్ర‌మోష‌న‌ల్ బీట్ కోసం కొల‌వెరిడి సంచ‌ల‌నం!
X
ద‌ర్శ‌కధీరుడు ఎస్.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న RRR ఇప్పుడు పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ భారీ సెట్ నిర్మించి ఓ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ ని చిత్రీక‌రిస్తున్నారు. సినిమా ప్రేక్ష‌కుల్లోకి వెళ్లే ముందు ఈ ప్ర‌మోష‌న‌ల్ గీతంతో హీట్ పెంచే ప్ర‌య‌త్నంలో భాగంగా జ‌క్క‌న్న ఇలా ప్లాన్ చేసారు.

ఇక జ‌క్క‌న్న ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా అవుట్ ఫుట్ విష‌యంలో ఎంత ప‌క్కా ప్ర‌ణాళిక తో ఉంటారో రిలీజ్ ముందు వ‌ర‌కూ జ‌రిగే ప్ర‌చారం విష‌యంలో అంతే కేర్ ఫుల్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ కోసం యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌ ని కూడా రంగంలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇందులో కొల‌వెరిడీ ఫేం అనిరుధ్ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ పాడుతూ త‌న‌దైన శైలి స్టెప్పు ల‌తో ఆక‌ట్టుకోబోతున్నాడు. ఇక అనిరుధ్‌ సింగింగ్ లో పెప్పీ ఎలిమెంట్ కి అత‌డిలోని ఎన‌ర్జిటిక్ స్టైలిష్ డ్యాన్సులు ప్ర‌ధాన అస్సెట్ కానున్నాయి. ముఖ్యంగా ప్ర‌మోష‌న‌ల్ సాంగ్స్ లో అల‌రించడం అత‌నిలో ఉన్న‌ మ‌రో ప్ర‌త్యేక‌త‌. గ‌తంలో `నానీస్ గ్యాంగ్ లీడ‌ర్` చిత్రానికి ఇలాగే ఓ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ లో పాడుతూ..డాన్స్ ల‌తో మురిపించాడు. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ న‌టించిన `అజ్ఞాత‌వాసి` చిత్రం కోసం కూడా ఓ ప్ర‌మోష‌న‌ల్ బీట్ లో క‌నిపించాడు. మ‌ళ్లీ ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం RRR కోసం ఇలా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇప్ప‌టికే జాతీయ అవార్డ్ గ్ర‌హీత అమిత్ తివారీతో క‌లిసి ఓ పాట కోసం మ‌ర‌క‌త‌మ‌ణి ఎం.ఎం.కీర‌వాణి ప‌ని చేస్తున్నారు. ఈ పాట సినిమాలో ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని స‌మాచారం. ఇంత‌కుముందే తివారీతో క‌లిసి ప‌ని చేయ‌డం ప్లెజెంట్ గా ఉంద‌ని కీర‌వాణి ఆనందం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల పాన్ ఇండియా చిత్రాల‌కు ఒక్కో పాట‌కు ఒక్కో ట్యాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ ని వినియోగించం చూస్తున్న‌దే. ఇదే కేట‌గిరీలో ఆర్.ఆర్.ఆర్ మ్యూజిక్ ట్రెండీగా ఉంటుంద‌న్న అంచ‌నా ఏర్ప‌డింది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ - ఆలియా .. ఎన్టీఆర్ - ఒలీవియా జంట‌ల‌పై ఈ పాట‌ల్ని ర‌స‌ర‌మ్యంగా తెర‌కెక్కిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.