ప్రేమ పెళ్లి గురించి అడిగితే ఇలా అనేసిందేంటీ?

Tue May 24 2022 18:21:50 GMT+0530 (IST)

kiara advani comments on marriage

తెలుగులో భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారి పోయింది. తెలుగు లో ఈ అమ్మడు ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ ల కాంబినేషన్ లో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.మరో వైపు ఈమె హిందీ లో నటించిన జగ్ జగ్ జీయో సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా యూనిట్ సభ్యులతో కలిసి కియారా అద్వానీ సందడి చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా కియారా అద్వానీ ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా వారు ప్రశ్నించగా ప్రేమ మరియు పెళ్లి విషయాలపై స్పందించి అందరిని ఆశ్చర్యపర్చింది.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. జీవితంలో పెళ్లి యొక్క ప్రాముఖ్యత గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటీ అంటూ ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ... కెరీర్ లో విజయవంతం అవ్వడం కోసం నేను జీవితంలో పెళ్లి అనే ట్యాగ్ ను వేసుకోవాలని భావించడం లేదు. పెళ్లి చేసుకోకుండానే నేను జీవితంలో సక్సెస్ అయ్యాను.. నేను ఇప్పుడు ఉన్న స్థితి పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తాను బాగా స్థిరపడ్డాను. నాకు వచ్చే సంపాదనతో చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా పెళ్లి చేసుకుని స్థిరపడాల్సిన అవసరం ఏంటీ అన్నట్లుగా కియారా అద్వానీ వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే గత కొంత కాలంగా జరుగుతున్న బ్రేకప్ వార్తలు నిజమే అనిపిస్తుంది. ఆమె పెళ్లి త్వరలో జరుగుతుందని భావిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిందేంటీ అంటూ అంతా అవాక్కవుతున్నారు.

కియారా అద్వానీ గతంలో సిద్దార్థ్ మల్హోత్ర తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తుల వచ్చాయి. ఇద్దరు చెట్టా పట్టాలేసుకుని తిరగడం అందరికి తెల్సిందే.

అయితే కారణం ఏంటో తెలియదు కాని వారిద్దరు విడిపోయి చాలా నెలలు అవుతోందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా కియారా అద్వానీ పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలతో బ్రేకప్ కన్ఫర్మ్ అయ్యింది. అంతే కాకుండా భవిష్యత్తులో పెళ్లి గురించి ఎత్తను అన్నట్లుగా కూడా  అభిప్రాయం వ్యక్తం చేసింది.