ఫిక్ టాక్ : అందమైన ప్రకృతిలో క్యూట్ కీర్తి

Wed Jul 21 2021 13:24:49 GMT+0530 (IST)

PickTalk: Cute fame in beautiful nature

టాలీవుడ్.. కోలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకు పోతున్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇతర హీరోయిన్స్ తో పోల్చితే ఈమె స్కిన్ షో చాలా తక్కువ చేస్తుంది. ముద్దుగుమ్మల అందాల ఆరబోతకు మాత్రమే అభిమానులు ఫిదా అవుతూ వారిని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. కాని కీర్తి సురేష్ తన క్యూట్ ట్రెండీ పిక్స్ ను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇటీవల రామేశ్వరం వెళ్లిన ఈమె అక్కడ సముద్రంలో సూర్యాస్థమయంను ఎంజాయ్ చేసింది. సూర్యోదయం మరియు సూర్యాస్థమయంలో సముద్ర తీరంలో ఉండి చూస్తే అద్బుతంగా అనిపిస్తాయి. ఈ ఫొటోలో కూడా అందమైన ప్రకృతి ని చూడవచ్చు. అందమైన ప్రకృతి మద్యలో క్యూట్ కీర్తి సురేష్ అందంకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. బోటింగ్ చేయడంతో పాటు నీటిలో అలా సరదాగా గడిపిన కీర్తి సురేష్ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

కీర్తి సురేష్ ఈ ఫొటోల్లో సింపుల్ అండ్ స్వీట్ గా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా లో నటిస్తుంది. తమిళంలో ఈమె పలు సినిమాలు చేస్తోంది. హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. అందాల ప్రదర్శణ విషయంలో మొదటి నుండి కూడా వ్యతిరేకంగా ఉన్న కీర్తి సురేష్ ను ఇప్పుడు ఆమె అభిమానులు పూర్తిగా పద్దతైన పాత్రల్లోనే చూడాలని ఆశపడుతున్నారు.

ఆమె అందాల ప్రదర్శణ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు అభిమానులు వ్యతిరేకించే అవకాశం ఉంది. కొందరు ముద్దుగుమ్మలు అందాల ప్రదర్శణ చేయకుంటే విమర్శలు ఎదుర్కోవడం.. ఆ సినిమాను చూడక పోవడం చేస్తారు. కాని కీర్తి సురేష్ మాత్రం  మహానటి ఇతర సినిమాల వల్ల పద్దతైన హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. అదే పద్దతిని ఆమె కొనసాగించాల్సిన అవసరం ఉందంటూ నెటిజన్స్ అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.