బొమ్మరిల్లు భాస్కర్ తర్వాత కరుణాకరణ్ కి కూడా..!

Wed Jun 09 2021 15:00:26 GMT+0530 (IST)

karunakaran Upcoming Movies Updates

ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా కరుణాకరణ్ కి పేరుంది. తొలి ప్రేమ- యువకుడు-వాసు-హ్యాపీ- డార్లింగ్ - ఉల్లాసంగా ఉత్సాహంగా.. ఇవన్నీ అతడిని దర్శకుడిగా నిలబెట్టిన సినిమాలు. చక్కని ప్రేమకథతో ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమాల్ని తెరకెక్కించిన పనితనం అతడికి ఉంది. వాసు- హ్యాపీ సినిమాలు పెద్ద తెరపై యావరేజ్ గా ఆడినా కానీ బుల్లితెరపై బంపర్ హిట్లుగా నిలిచాయి. ఇక కరుణాకరన్ ప్రేమ సన్నివేశాల మాంటేజెస్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. మాంటేజెస్ స్పెషలిస్టుగా అతడికి పేరుంది.దురదృష్టవశాత్తూ గత మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలవడమే గాక.. లాజిక్ లేని కథనాలతో పూర్తి ఫెయిల్యూర్ అన్న బ్యాడ్ టాక్ అతడిపై వచ్చింది. దీంతో కరుణాకరణ్ కి ఆఫర్లు లేవు. చివరిగా సాయి తేజ్ తో తీసిన తేజ్ ఐలవ్ యు కూడా పెద్ద ఫ్లాపవ్వడంతో రెండేళ్లుగా అతడి ఉనికి కనిపించలేదు.

ఎట్టకేలకు ఈ గ్యాప్ లో ఓ రెండు స్క్రిప్టులు రెడీ చేసి హీరోలను ఛేజ్ చేస్తున్నాడని తెలిసింది. ఇప్పటికే ఒక తెలుగు యువహీరోతో మంతనాలు సాగిస్తున్నాడట. గతంలో హిట్టిచ్చాడన్న  సెంటిమెంటుతో మరో పెద్ద హీరో కూడా కథ చెప్పమన్నారట. అయితే ఆ రెండిటినీ ఓకే చేసుకుంటాడా లేక ఏదో ఒకటి ఖాయమవుతుందా? అన్నది వేచి చూడాలి. అవకాశాలు అరుదుగానే వస్తుంటాయి. వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే తిరిగి కంబ్యాక్ అయ్యేందుకు ఛాన్సుంటుంది. కరుణాకరణ్ ఏం చేస్తారో వేచి చూడాలి. బొమ్మరిల్లు భాస్కర్ కి గ్యాప్ వచ్చాక అఖిల్ తో ఛాన్స్ వచ్చింది. ఆయన నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. కరుణా కరన్ కి అలాంటి అవకాశమే ఇది.