స్టార్ హీరోయిన్ పెళ్లి మరింత స్పష్టత

Wed Jul 21 2021 12:07:08 GMT+0530 (IST)

Star? heroine? wedding more resolution

బాలీవుడ్ హాట్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ పెళ్లికి రెడీ అయ్యిందంటూ గత కొన్ని వారాలుగా బాలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. జాతీయ మీడియాలో ఈ వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆమె నుండి స్పష్టత రాలేదు. కాని తాజాగా ఆమె మేనేజర్ యాష్లె పెట్టిన పోస్ట్ తో అతి త్వరలోనే ఆమె పెళ్లి ఉంటుందని కన్ఫర్మ్ అయ్యింది. ఆమె పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా కూడా తాజాగా ఆయన షేర్ చేసిన ఫొటోతో క్లారిటీ వచ్చింది. యాష్లె పోస్ట్ తో ఆమె పెళ్లి గురించి ఇంతగా హడావుడి ఉండేది కాదు. కాని యాష్లె పోస్ట్ ను షేర్ చేసిన కత్రీనా థ్యాంక్యూ అంటూ స్పందించింది. అంటే ఆమె తన పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసినట్లే కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పెళ్లి కూతురు కాస్ట్యూమ్స్ లో ఉన్న కత్రీనా ఫొటోను షేర్ చేసిన యాష్లె త్వరలోనే ఇది నిజం కావాలంటూ కోరుకుంటున్నట్లుగా కామెంట్ పెట్టడం.. అందుకు కత్రీనా స్పందించడం వంటి పరిణామాలు చూస్తుంటే అతి త్వరలోనే కత్రీనా పెళ్లికి సిద్దం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. నాలుగు పదుల వయసు లోపే పెళ్లి చేసుకుంటాను అంటూ గతంలో ప్రకటించింది కత్రీనా. ఇటీవల ఆమె 39 ఏళ్ల వయసుకు అడుగు పెట్టింది. ఆమె తదుపరి బర్త్ డే కు ముందే పెళ్లి ఉంటుందని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక కత్రీనా ప్రేమ విషయానికి వస్తే గతంలో ఇద్దరు హీరోలతో ప్రేమ వ్యవహారం సాగించింది. కాని వారితో విడిపోయిన కత్రీనా కొన్నాళ్లు ఒంటరిలైఫ్ ను లీడ్ చేసింది. ప్రస్తుతం ఈమె యువ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే.

విక్కీ కౌశల్ తో ప్రేమాయణం గురించి చాలా రోజులుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారు నిజమే అన్నట్లుగా అధికారికంగా ప్రకటించకుండా అనధికారికంగా వారి ప్రేమను నిజమే అంటూ చెప్పకనే చెప్పారు. ఇద్దరు కలిసి ప్రత్యేక వేడుకలకు హాజరు అవ్వడం.. డేటింగ్ లు పార్టీలు ఇద్దరు కలిసి తిరుగుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వస్తుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే వీరిద్దరు రాబోయే కొన్ని నెలల్లో పెళ్లి పీఠలు ఎక్కడం దాదాపుగా ఖాయం అంటూ క్లారిటీ వచ్చేసింది.

ఈ సమయంలో కొందరు అభిమానులు మాత్రం సాధ్యం అయినంత త్వరగా పెళ్లి చేసుకోవాలని.. మళ్లీ ఆలస్యం అయితే లవ్ బ్రేకప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమలో ఎక్కువ కాలం ఉండటం వల్ల అపార్థాలు వస్తాయని.. తద్వార పెళ్లికి మరోకరిని చూసుకోవాల్సి వస్తుందని ఇంకొందరు కత్రీనా కు సూచిస్తున్నారు. విక్కీ కౌశల్ మరియు కత్రీనాలు ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ బిజీ స్టార్స్. అలాంటి వీరిద్దరు జత కట్టి రియల్ లైఫ్ లో ఒక్కటి అయితే ఖచ్చితంగా ఒక అందమైన జంటగా వీరు నిలవడం ఖాయం.