Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ 2 కి ఆ రికార్డ్‌ కూడా లేకుండా చేసిన కాంతార

By:  Tupaki Desk   |   30 Nov 2022 2:30 AM GMT
కేజీఎఫ్‌ 2 కి ఆ రికార్డ్‌ కూడా లేకుండా చేసిన కాంతార
X
ఏ ముహూర్తాన కాంతార సినిమా విడుదల అయ్యిందో కానీ రెండు నెలలు పూర్తి అయినా కూడా సందడి చేస్తూనే ఉంది. కన్నడ సినీ చరిత్రలో ఒకప్పుడు పాతిక నుండి యాబై కోట్ల వసూళ్లు సాధించడం అంటేనే గొప్ప విషయం. అలాంటిది కేజీఎఫ్ సినిమా కర్ణాటకలో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కేజీఎఫ్‌ కి తప్ప మరే కన్నడ సినిమాకు కూడా ఆ రికార్డులు నమోదు చేయడం సాధ్యం కాదని అంతా భావించారు.

కర్ణాటక లో కేజీఎఫ్ 2 సినిమా యొక్క వసూళ్ల రికార్డులను బ్రేక్ చేయాలి అంటే కచ్చితంగా పదుల సంవత్సరాలు పడుతుందని అంతా భావించారు. కానీ కనీసం ఏడాది కూడా దాట కుండానే కన్నడ నాట కాంతార సినిమా వసూళ్లు కేజీఎఫ్ 2 సినిమా యొక్క రికార్డును బ్రేక్‌ చేసింది.

అత్యధిక ప్రేక్షకులు చూసిన కన్నడ సినిమాగా కాంతార ఇప్పటికే రికార్డు సృష్టించింది. తాజాగా కలెక్షన్స్ విషయంలో కూడా కేజీఎఫ్ 2 యొక్క రికార్డును కాంతార బ్రేక్ చేసింది. 60 రోజులు పూర్తి అయిన తర్వాత కూడా సాలిడ్ కలెక్షన్స్ వస్తూ ఉండటంతో కేజీఎఫ్‌ 2 రికార్డు బ్రేక్‌ అయ్యిందని కన్నడ సినీ వర్గాల వారు మరియు బాక్సాఫీస్ వర్గాల వారు అధికారికంగా ప్రకటించారు.

కేజీఎఫ్ 2 సినిమా లాంగ్‌ రన్‌ లో కర్ణాటక వరకు 172 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. కాంతార సినిమా ఆ మార్క్ ను క్రాస్ చేసింది. తాజా వీకెండ్‌ లో కాంతార సినిమాకు మళ్లీ సాలిడ్‌ షేర్‌ రావడంతో ఏకంగా 172.35 కోట్ల రూపాయలుగా వసూళ్లు నమోదు అయినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కాంతార సినిమా కేజీఎఫ్ 2 లో సగం కూడా రాబట్టలేక పోయింది. కానీ స్థానికంగా.. ప్రాంతీయ భాషల్లో సొంత ప్రేక్షకుల ముందు మాత్రం కేజీఎఫ్ 2 ను వెనక్కి నెట్టి కాంతాన నెం.1 గా నిలిచింది. కేజీఎఫ్ 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించిన విషయం తెల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.