Begin typing your search above and press return to search.

వాడుకొని వదిలేసిన ప్రియుడు!.. నటి ఆత్మహత్య

By:  Tupaki Desk   |   2 Jun 2020 5:50 AM GMT
వాడుకొని వదిలేసిన ప్రియుడు!.. నటి ఆత్మహత్య
X
ఎంతో భవిష్యత్ ఉన్న వర్ధమాన నటి ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్య చేసుకొంది. ఐదు సంవత్సరాలుగా ప్రేమ పేరుతో సర్వం వాడుకొని పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో తట్టుకోలేకపోయింది. జీవితంపై విరక్తి చెంది సెల్పీ వీడియో తీసుకొని మరీ విషం తాగి సూసైడ్ చేసుకుంది.దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ షాక్ కు గురైంది.

కర్ణాటకలోని కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా పేరొందిన చందన (29) ది హాసన్ జిల్లా బేలూరు ప్రాంతం. బెంగళూరుకు చేరుకొని తావరకెరెలోని లేఔట్ లో నివాసం ఉంటోంది. పలు కన్నడ టీవీ సీరియల్స్, సినిమాలు, పలు ప్రకటనల ద్వారా నటిగా గుర్తింపు పొందింది. రైతు కుటుంబంలో పుట్టిన చందన పరువు పోవడంతో తట్టుకోలేకపోయింది.

బెంగళూరులోనే నివాసం ఉంటున్న దినేష్ అనే యువకుడు ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐదేళ్లుగా దినేష్, నటి చందన ప్రేమించుకుంటున్నారు. దినేష్ ను పెళ్లి చేసుకొని స్థిరపడాలని నటి చందన కలలు కన్నది. అయితే ఐదేళ్లు నటిని సాంతం వాడుకున్న దినేష్ పెళ్లికి మాత్రం నో చెప్పాడు. పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. తన తల్లిదండ్రులతో దినేష్ ఇంటికి వెళ్లి అడుగించింది. అయితే నటిగా ఆమె చాలా మందితో తిరిగిందని.. మా కోడలుగా చేసుకోము అంటూ దినేష్ తల్లిదండ్రులు అవమానించారు.

ఇక తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని.. తాను నిన్ను పెళ్లి చేసుకోనని దినేష్ తేల్చిచెప్పడంతో చందన షాక్ అయ్యింది. ఐదేళ్లుగా తాను సంపాదించిన డబ్బులు మొత్తం జల్సాల కోసం ఖర్చు చేశాడని.. తనను శారీరకంగా వాడుకొని అబార్షన్ కూడా చేయించిన దినేష్ ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతో చందన తట్టుకోలేకపోయింది.

జూన్ 1న సోమవారం డెత్ సూసైడ్ నోట్ చేసి సెల్ఫీ వీడియో తీసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి లక్షల రూపాయలు వాడుకున్నాడని.. ఇప్పుడు నిరాకరిస్తున్నాడని వీడియోలో దినేష్ గురించి నిజాలు చెప్పింది. అనంతరం గ్లాసులో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మరో అమ్మాయిని దినేష్ మోసం చేయకుండా ఇలా చేస్తున్నాని విషం తాగి కుప్పకూలిపోయింది.

ఈ వీడియోను దినేష్ కు పంపింది చందన. అతడు వెంటనే ఆమె ఫ్టాట్ కు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమె అప్పటికే మృతిచెందిందనడంతో ఆస్పత్రి నుంచి దినేష్ పరారయ్యాడు.

చందన చనిపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దినేష్ తోపాటు తల్లి, తండ్రి, మామలపై కేసు పెట్టారు. వారు పరారీలో ఉండడంతో వెతుకుతున్నారు.