Begin typing your search above and press return to search.

కంగనతో గాయ‌కుడు కం న‌టుడు దిల్జిత్ దోసాంజ్ అగ్లీ ఫైట్‌

By:  Tupaki Desk   |   4 Dec 2020 3:17 AM GMT
కంగనతో గాయ‌కుడు కం న‌టుడు దిల్జిత్ దోసాంజ్ అగ్లీ ఫైట్‌
X
పిలిచి క‌య్య‌మాడ‌‌డం క్వీన్ కంగ‌నకు కొత్తేమీ కాదు. నోటికి ప‌ని చెప్ప‌నిదే క్ష‌ణ‌మైనా గ‌డ‌వదు. ఇంత‌కుముందు హృతిక్ రోష‌న్... మ‌హేష్ భ‌ట్.. ఆలియా భ‌ట్.. క్రిష్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే ఉంది.. ఇటీవ‌ల శివ‌సేన నాయ‌కుల‌పైనా వీర లెవ‌ల్లో పోరాటం సాగిస్తోంది కంగ‌న‌. ఇటీవ‌ల రాజ‌కీయ నాయ‌కులతో వీరంగం పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకుంటోంది.

తాజాగా క్వీన్ ఖాతాలో మ‌రో స్టార్ సింగ‌ర్ కం న‌టుడు చేరాడు. కంగ‌న‌తో దిల్జీత్ దోసాంజ్ ఫైట్ అగ్లీగా మారుతోంది. ఆమె అతన్ని కరణ్ జోహార్ పెంపుడు కుక్క‌ అని పిల‌వ‌డంతో అత‌డికి న‌షాలానికి ఎక్కింది. దానికి అత‌డు ఇచ్చిన ఘాటైన రిప్ల‌య్ ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చింది. కంగ‌నకు ‘తమీజ్’ (బుర్ర‌) లేదు అంటూ దిల్జీత్ కౌంట‌ర్ వేయ‌డంతో అది నెటిజ‌నుల్లో హాట్ టాపిక్ గా మారింది.

అస‌లింత‌కీ ఆ ఇద్ద‌రి గొడ‌వ ఎలా మొద‌లైంది? అంటే.. పంజాబీ
రైతుల నిరసనలో చేరిన వృద్ధ సిక్కు మహిళపై వ్యాఖ్యానించినందుకు కంగనా రనౌత్ తనపై ట్వీట్ చేయడంతో దిల్జిత్ దోసాంజ్ తిరిగి కౌంట‌ర్ వేశాడు. దిల్జిత్ కరణ్ జోహార్ పెంపుడు జంతువు అంటూ కామెంట్ చేయ‌గా.. అత‌డు కౌంట‌ర్ వేసాడు. ఆ గొడ‌వ‌లో ఒక‌రిపై ఒక‌రు ట్వీట్ చేసిన తర్వాత మాట మాట పెరిగింది. అది ఇప్పుడు బాహాబాహీలా మారుతోంది.

కంగ‌న వేరొక ట్వీట్ లో,.. “రాబందులూ వినండి.. నా నిశ్శబ్దాన్ని నా బలహీనతగా భావించవద్దు. అమాయక రైతులను అబద్ధాల‌తో ఉసిగొల్పి రెచ్చ‌గొట్ట‌డం నేను చూస్తున్నాను. షాహీన్ బాగ్ మాదిరిగానే,.. ఈ నిరసనల వెనుక నిజం త్వరలో బయటపడుతుంది. అప్పుడు నేను ఒక మీ సంగ‌తి చెబుతాను. మీ ముఖాలను నల్లగా మొద్దుబారాలే చేస్తాను ” అని ట్వీట్ లో రాసి‘ బబ్బర్ షెర్ని’ అని సంతకం చేసింది.

దీనికి కౌంట‌ర్ గా దిల్జిత్ ప్రతీకారం తీర్చుకున్నాడు. “మీరు పనిచేసిన ఇండ‌స్ట్రీ జ‌నాలంతా పెంపుడు జంతువులా? అప్పుడు మీ ఉన్నతాధికారుల జాబితా పొడవైన‌దే అయ్యి ఉండాలి. ఇది బాలీవుడ్ కాదు పంజాబ్. అబద్ధాలు చెప్పడం వారి భావోద్వేగాలతో ఆడుకోవడం ద్వారా ప్రజలను మానిప్యులేట్ చేయడం మీకే బాగా తెలుసు. నేను బాలీవుడ్ నుండి కాదు.. పంజాబ్ నుండి వచ్చాను. బాలీవుడ్ లో కష్టపడుతున్నది నేను.. ద‌ర్శ‌క‌ నిర్మాతలు నాకు పని ఇస్తారు. వారి సినిమాల్లో చేరమని అడుగుతారు`` అని దిల్జీత్ సుదీర్ఘ‌మైన నోట్ రాశారు.

``నేను కంగనా రనౌత్.. మీలాంటి బూట్లిక్కర్ కాదు.. అబద్ధం చెప్పేదాన‌ను కాను. నేను షాహీన్ బాగ్ నిరసనకారుడి గురించి మాత్రమే మాట్లాడాను. బాలీవుడ్ వాళ్ల గురించి అని ఎవరైనా నిరూపించగలిగితే నేను క్షమాపణ చెబుతాను..`` అంటూ మాట‌కు మాట పెంచింది కంగ‌న‌. రైతుల నిర‌స‌నల్లో 100కు ప‌ని చేసే కార్మికులు అంటూ తిట్టేసింది క్వీన్.

దానికి ప్ర‌తిస్పంద‌న‌గా కంగనాకు మర్యాద లేదని దిల్జిత్ సీరియ‌స్ అయ్యారు. “ఒకరి తల్లి లేదా సోదరితో ఎలా మాట్లాడాలో మీకు తెలియదు. మీరు ఒక మహిళ.. అయ్యి ఉండీ మరొకరిని ఇలా పిలుస్తారా?వారు రూ .100 కు పని చేస్తారు. మా పంజాబ్ తల్లులు మాకు దేవుళ్లు.`` అని రాశారు.

కంగనా మళ్ళీ షాహీన్ బాగ్ ‘దాది’ గురించి మాట్లాడుతున్నానని చెప్పడంతో గొడ‌వ కొత్త‌ మలుపు తీసుకుంది. మరొక ట్వీట్ లో, “ప్రజల తల్లులు ..సోదరీమణులను కించపరచడానికి రూ .100 కోసం నిరసన తెలిపే కార్మికులను పిలవాల‌ని ఏ పాఠశాల మీకు నేర్పింది.” అంటూ కంగ‌న దిల్జీత్ ని ఉద్ధేశించి ప్ర‌శ్నించింది.

అంతకుముందు రోజు కంగ‌న‌కు కౌంట‌ర్ వేస్తూ దిల్జిత్ ట్వీట్ చేసాడు. రైతుల నిర‌స‌న‌ల్లో క‌నిపించిన‌ ఒక వృద్ధ సిక్కు మహిళపై వ్యాఖ్యానించినందుకు ఆమెను నిందించాడు. కంగనా ఆమెను షాహీన్ బాగ్ నిరసనలకు చెందిన బిల్కిస్ బానో అని తప్పుగా ప్ర‌స్థావించ‌డంతో దిల్జీత్ సీరియస్ అయ్యారు. రైతుల నిరసనలో తాను కూడా కేవలం 100 రూపాయలకు చేరినట్లు షాహీన్ చెప్ప‌గా కంగ‌న‌ వెంటనే త‌న ట్వీట్ ను తొలగించింది. ‘ఆమె ఏదైనా చెబుతుంది’ ‘అంత గుడ్డిగా ఉండకూడదు’ అంటూ కంగ‌న‌పై దిల్జీత్ కౌంట‌ర్ వేశారు. ఇక అల్ల‌ర్ల‌లో మ‌హిళ ముఖాన్ని తారు మారు చేసార‌ని కంగ‌న మ‌రో కౌంట‌ర్ వేసింది దిల్జీత్ పై. ఈ వార్ ఇలా అనంతంగా సాగుతోంది.

పంజాబీ మ‌హిళ‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు కంగనాకు న్యాయవాది హర్కం సింగ్ లీగల్ నోటీసు పంపారు. నవంబర్ 30 నాటి లీగల్ నోటీసులో కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు సమాచారాన్ని ధృవీకరించాలని ఆయన సూచించారు. ఆమె ట్వీట్లపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిలో ఆమె మహిళను తప్పుగా గుర్తించిందని ఆరోపించారు.