క్వీన్ కంగన అన్ లిమిటెడ్ షో

Sun May 19 2019 12:16:28 GMT+0530 (IST)

kangana Ranaut Glamourous Pose

కేన్స్ 2019 సంబరాలు అంబరాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. ఫ్రెంచి రివేరా వేదికగా ఈ పండగను అంతర్జాతీయ సెలబ్రిటీల నడుమ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వారం అంతా సెలబ్రిటీ ర్యాంప్ వాక్ కనువిందు చేయనుంది. ఇప్పటికే ఈ వేదికపై బాలీవుడ్ అందగత్తెల వయ్యారాల వడ్డన వేడుకకే వన్నె తెచ్చింది. స్టార్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా.. దీపిక పదుకొనే... కంగన ఇప్పటికే రకరకాల డిజైనర్ డ్రెస్సుల్లో రెడ్ కార్పెట్ ని అదరగొడుతున్నారు. నిన్నటి సాయంత్రం ప్రియానిక్ షో అదిరిపోయింది.తాజాగా క్వీన్ కంగన మరో కొత్త లుక్ తో హీటెక్కించింది. ఇప్పటివరకూ రక రకాల డిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకున్న కంగన ఆరంగేట్రమే బంగారు వర్ణం డిజైనర్ కాంజీవరం శారీలో కనిపించి హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా లైట్ కలర్ ఫ్లోరల్ లుక్.. స్ట్రాప్ లెస్ డిజైనర్ డ్రెస్ లో కంగన షో యువతరం గుండెల్లోకి సూటిగా దూసుకెళ్లిపోయింది. రెగ్యులర్ షోతో పోలిస్తే ఈసారి కాస్తంత అందాల ఎగ్జిబిషన్ లో కంగన వేడి పెంచిందనే చెప్పాలి. ఇంతకుముందు వెస్ట్రన్ స్టైల్ బ్లాక్ జాకెట్ లో ఓపెన్ షోస్ తో మైమరిపించిన కంగన ఈసారి క్లాస్సీ లుక్ తో ఆకట్టుకుంది. ఫ్రెంచి రివెరాలో నది అంచున ఖరీదైన బోట్స్ పై ఈ ఫోటో షూట్ చేయడం ఆసక్తికరం.

కంగన అన్ లిమిటెడ్ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లోకి దూసుకొచ్చాయి. ఆన్ లైన్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి. కాన్సెప్ట్ షూట్ ఇది. ఆ ఖరీదైన గౌన్ గాలికి ఎగురుతుంటే .. కంగన థై షో హైలైట్ గా నిలిచింది. మొత్తానికి కేన్స్ ని క్వీన్ గడగడలాడించింది. ప్రపంచ సుందరీమణులు కొలువు దీరే ఈ వేదికకు క్వీన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాటి బాలీవుడ్ నాయికలకు సైతం కంగన ఠఫ్ కాంపిటీషన్ ఇవ్వడం ఆసక్తికరం.