ప్రీలుక్: కళ్యాణ్ రామ్ కేరాఫ్ రాఖీ భాయ్!?

Tue Jul 05 2022 20:06:18 GMT+0530 (IST)

kalyan ram birthday special bimbisara movie update

హీరో కం నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతి ప్రయత్నం ఆసక్తిని పెంచేదే. పటాస్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ రేంజు విజయం కోసం చాలా కాలం వేచి చూసి ఇటీవల సరికొత్తగా భారీ కాన్సెప్టులతో తిరిగి వస్తున్నాడు. భారీ బడ్జెట్లతో సాహసాలు చేసే నిర్మాతగా కళ్యాణ్ రామ్ కి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇక పాన్ ఇండియా ట్రెండ్ లో నేను సైతం అంటూ దుందుడుకుగా దూకుతున్నాడు. ఇంతకుముందే `బింబిసార` ట్రైలర్ తో అతడు ఒక రకంగా ప్రకంపనాలే సృష్టించాడు.భారీ తనం నిండిన పురాణేథిహాస కాన్సెప్టుతో గుబులు పుట్టించాడు. రాక్షస అంశతో జన్మించిన బింబిసారుని ఉగ్రరూపం ఎలా ఉంటుందో ట్రైలర్ లో ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. పురాణాలకు ప్రెజెంట్ కనెక్టివిటీ కూడా ఆసక్తిని పెంచింది. ఇక హిట్టు కొడతామా లేదా? అన్నది అటుంచితే కళ్యాణ్ రామ్ గట్స్ మరోసారి బయటపడ్డాయి! అంటూ పొగడని వారు లేరు.

బింబిసార సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో చేస్తున్న అతడు.. ఇప్పుడు టాలీవుడ్ పాపులర్  బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మరో భారీ చిత్రం చేస్తున్నాడు. మైత్రిలో నందమూరి కళ్యాణ్ రామ్ తన 19వ చిత్రాన్ని 2021 ఫిబ్రవరిలో ప్రారంభించారు.

నేడు తన పుట్టినరోజు కానుకగా ఈ సినిమా కీలక అప్ డేట్ ని మైత్రి సంస్థ అందించింది. మూవీ టైటిల్ టీజర్ ను అతి త్వరలో ఆవిష్కరిస్తామని ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఇది భారీ యాక్షన్ ఫిల్మ్ అని హింట్ లభించింది.

అయితే పోస్టర్ ప్రకారం.. గన్స్ తో చెలరేగే మాఫియా కుర్రాడి కథ అని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ మూవీలో ఓ ప్రముఖ హీరో అతిథిగా మెరిసే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. పోస్టర్ లుక్ చూడగానే.. కేజీఎఫ్ రాఖీ భాయ్ గుర్తుకు వస్తున్నాడు.

కళ్యాణ్ రామ్ ఈసారి రాఖీ భాయ్ కి కజిన్? అవుతాడా? అంటూ నెటిజనుల్లో కామెంట్లు పడిపోతున్నాయ్! ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ కి నూతన దర్శకుడు రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను టీమ్ ఇంకా వెల్లడించాల్సి ఉంది.