మెగా అల్లుడి టైం అస్సలు బాగున్నట్లు లేదు

Sun Nov 17 2019 23:00:01 GMT+0530 (IST)

kalyaan dhev Super Machi Movie Facing Financial Problems

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా వెలుగు వెలగాలని చాలా ఆశ పడుతున్నాడు. చిరంజీవి అల్లుడు అవ్వడం వల్ల కళ్యాణ్ దేవ్ ను ఈజీగానే ప్రేక్షకులు స్వీకరిస్తారని కొందరు భావించారు. కాని పరిస్థితి అలా కనిపించడం లేదు. కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా విజేత బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పర్చింది. విజేత తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ దేవ్ మళ్లీ ఇటీవలే 'సూపర్ మచ్చి' అనే టైటిల్ తో సినిమాను మొదలు పెట్టాడు.పులి వాసు దర్శకత్వంలో 'సూపర్ మచ్చి' చిత్రంను రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఇటీవలే సినిమాను అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సినిమా ప్రారంభం అయ్యి కొన్ని వారాలు అయ్యిందో లేదో అప్పుడే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిందనే టాక్ మొదలైంది. నిర్మాణ సంస్థ ఇటీవల నిర్మించిన రెండు సినిమాలు ఆర్థికంగా నష్టాలను మిగిల్చాయని.. అందుకే ఈ చిత్రంకు పెట్టుబడి పెట్టడంలో నిర్మాత ఇబ్బంది పడుతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

మొదటి సినిమా నిరాశ పర్చడంతో కాస్త గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని ఎంపిక చేసుకున్న కళ్యాణ్ దేవ్ కు ఈ సినిమాకు కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయట. మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ టైం బాగాలేని కారణంగా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోవడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కొందరు ఫైనాన్షియర్స్ తో మాట్లాడి సదరు నిర్మాణ సంస్థకు ఫైనాన్స్ ఇప్పించినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ మాట సాయంతో మళ్లీ సినిమా ప్రారంభం కాబోతుందట. సినిమా మంచి కంటెంట్ తో తెరకెక్కిస్తే తప్పకుండా విడుదల సమయంలో హెల్ప్ చేస్తానంటూ చిరంజీవి హామీ ఇచ్చాడట. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు సినిమాను చాలా సీరియస్ గా తీసుకుని తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.