Begin typing your search above and press return to search.

ఆ బ్యూటీకి తల్లిగా కాజల్... ఇదేందయ్యా ఇది

By:  Tupaki Desk   |   28 Jan 2023 4:00 PM GMT
ఆ బ్యూటీకి తల్లిగా కాజల్... ఇదేందయ్యా ఇది
X
వీర సింహారెడ్డి తో సూపర్ సక్సెస్ అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ తో ఒక విభిన్నమైన యాక్షన్ సినిమా ను తెరకెక్కించబోతున్నట్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించాడు. వీర సింహా రెడ్డి సినిమా విడుదలకు ముందే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

రెండవ షెడ్యూల్ ప్రారంభానికి ముందే హీరోయిన్ విషయం లో ఒక నిర్ణయానికి రావాలని దర్శకుడు అనిల్ రావిపూడి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీర సింహా రెడ్డి సినిమా లో బాలకృష్ణ జోడి గా నటించిన హనీ రోజ్ ని ఈ సినిమా లో హీరోయిన్ తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది.

అంతే కాకుండా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సింహ, టాలీవుడ్ యంగ్ బ్యూటీ ప్రియాంక జవాన్కర్, సీనియర్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, నయనతార పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. అయితే ఫైనల్ గా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. మరి ఇందులో నిజమంతా తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

ఇకపోతే గతం లో ఒకటి రెండు సార్లు బాలకృష్ణ కు జోడి గా నటించేందుకు కాజల్ అగర్వాల్ నో చెప్పిందని సమాచారం. ఈ క్రమంలోనే ఆమె బాలయ్య సినిమాకు ఓకే చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ కాజల్ బాలయ్య సినిమాకు ఓకే చెప్పి ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీలీల కు తల్లిగా నటించే అవకాశం కూడా ఉంది.

ఎందుకంటే ఈ చిత్రం ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ గా రూపొందుతోంది. ఇందులో బాలయ్య తండ్రిగా.. శ్రీ లీల కూతురుగా నటిస్తోంది. అంతే కాకుండా వీర సింహా రెడ్డి సినిమా లో ఆకట్టుకున్న హనీ రోజ్ కూడా బాలయ్య కు మంచి జోడి అన్నట్లుగా అభిమానుల అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆమె ఈ సినిమా లో అన్న నటిస్తే మంచి టాక్ దక్కే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కాజల్ అగర్వాల్ సినిమా కెరీర్ విషయానికొస్తే ఆమె తల్లి అయిన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.