ఫోటో స్టోరి: చందమామ సూపర్ క్యూట్ కానీ..!

Thu Jul 07 2022 10:04:21 GMT+0530 (IST)

kajal aggarwal latest photo

చందమామ కాజల్ అగర్వాల్ దేశంలోని అగ్ర కథానాయికలలో ఒకరు. దశాబ్దానికి పైగా దక్షిణ భారత పరిశ్రమల్ని శాసించారు. తన స్నేహితుడు కం బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఇటీవల మగబిడ్డను ప్రసవించడంతో కెరీర్ పరంగా చిన్న విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత కాజల్ తాజా ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాజల్ తల్లి అయిన తర్వాత ప్రశాంత చిత్తంతో ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ పై సోషల్ మీడియాల్లో లైక్ లు హోరెత్తుతున్నాయి.

చందమామ సూపర్ క్యూట్..! అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతానికి కిడ్ ఆలనాపాలనలోనే చందమామ తరిస్తోంది. త్వరలో తెలుగు సినిమాల్లోకి పునరాగమనం చేస్తుందని ఆశిద్దాం.

క్రేజీ ఆఫర్లు త్యాగం..

పెళ్లికి ముందు చందమామ దక్షిణాదిన పలు క్రేజీ చిత్రాలకు అంగీకరించిన సంగత తెలిసిందే. కానీ పెళ్లి ఆ వెంటనే ఫ్నెగ్నెన్సీ కారణాలతో వాటన్నిటినీ వదులుకుంది.  మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ కలయికలో కొరటాల తెరకెక్కించిన ఆచార్యలో కాజల్ నటించింది. కానీ ఆ మూవీలో తన పాత్ర కనిపించలేదు.

కింగ్ నాగార్జున -ప్రవీణ్ సత్తారు మూవీ ఘోస్ట్ లో తొలి ఆప్షన్ కాజల్. కానీ ఆ మూవీ నుంచి వైదొలిగింది. కమల్ హాసన్ భారతీయుడు 2 నుంచి కాజల్ తప్పుకుందన్న ప్రచారం ఉంది. అటు తమిళ చిత్రసీమలో మరి కొన్నిటిని వదులుకుందని సమాచారం.