టీజర్ టాక్ : వేట కోసం కాచుకున్న చిరుత

Sat Jun 25 2022 17:21:13 GMT+0530 (IST)

kaduva teaser launch by hero nani

మలయాళ చిత్ర సీమలో ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్న పేరు పృథ్వీరాజ్ సుకుమారన్. బ్యాక్ టు బ్యాక్ హీరోగా నూ డైరెక్టర్ గా నూ సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు. తను చేసిన ప్రతీ సినిమా ఇప్పడు మాలీవుడ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోంది. ఇందులో కొన్ని తెలుగులో రీమేక్ అవుతున్నాయి కూడా. ఇప్పటికే పృథ్వీరాజ్ నటించిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` ని తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `భీమ్లానాయక్` గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం పృథ్వీరాజ్ నటించి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో రూపొందించిన `లూసీఫర్` కూడా తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా డైరెక్షన్ లో ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఆగస్టులో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఇటీవల పృథ్వీరాజ్ నటించిన `జనగణమన` మంచి విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకుంది.  

ఇలా హీరోగా దర్శకుడిగా మాంచి జోరు మీదున్న పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ `కడువా`.  యాక్షన్ చిత్రాల దర్శకుడు షాజీ కైలాష్ దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుప్రియా మీనన్ లిస్టిన్ స్టీఫెన్ సంయుక్తంగా  నిర్మించిన ఈ మూవీని మలయాళంతో పాటు తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో జూన్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగులోనూ ఇదే టైటిల్ తో ఈ మూవీ విడుదల కానుంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ కీలక పాత్రలో నటించారు.

మూవీ రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో శనివారం ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం హైదరాబాద్ వచ్చింది.  ఈ సందర్భంగా ఈ మూవీ టీజర్ ని హీరో నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. `ఎవడ్రా మీ ఊళ్లో కురియన్ అంటా .. వాడెవరడో కొత్తోడైవుంటాడు సర్.. ఊళ్లో వాడికి ఇంకో పేరుంది...కురువశ్చన్.. కడువా కురియన్ కురువశ్చన్`.. అంటూ సాగే సంభాషణలతో టీజర్ మొదలైంది.

ఆయనొక చిరుత సార్..వేట కోసం కాచుకున్న చిరుత` అంటూ పృథ్వీరాజ్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తున్న తీరు.. వైట్ అండ్ వైట్ లో చేతికి చిరుత సింబల్ గోల్డ్ రింగ్ ధరించి పృథ్వీరాజ్ పోలీసులని చిరుతలా మట్టి కరిపిస్తున్న తీరు మూవీపై అంచనాల్ని పెంచేస్తోంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ పై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు.. టెర్రిఫిక్ విజువల్స్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా వివేక్ ఓబెరాయ్ కనిపిస్తున్న తీరు.. ఈ ఇద్దరి మధ్య సాగే పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు షాజీ కైలాష్ ఈ మూవీని తీర్చి దిద్దిన విధానం మాస్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునేలా వుంది. చిరుతలా పృథ్వీరాజ్ పాత్రని చూపించిన స్టైల్ మాస్ కి పూనకాలు తెప్పించేలా వుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా మలయాళ తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో ఏక కాలంలో జూన్ 30న విడుదల చేస్తున్నారు.