ఈజిప్షియన్ క్వీన్ లా ఆ ఫోజేంటమ్మోవ్!

Wed Jul 21 2021 12:21:12 GMT+0530 (IST)

jhanvi kapoor Latest Photoshoot

చూస్తుంటే ఈజిప్షియన్ క్వీన్ లా.. ట్రాయ్ యువరాణిలా జాన్వీ కొత్త గెటప్ చూశారు కదా...!  రాణులకే కన్ను కుట్టే అందమిది. ఇంతందంగా ఫోజివ్వడం ఈ నటవారసురాలికే తెలుసును సుమీ!  పై నుంచి మామ్ శ్రీదేవి దివ్యాశీస్సులు అందుకుని ఇలలో బోని గైడెన్సుతో కరణ్ జోహార్ మనీష్ మల్హోత్రా అండదండలతో ఇంత ఇదిగా తనను తాను షైనప్  చేసుకుంటోంది జాన్వీ.ఈజిప్ట్ టోంబ్స్ నేపథ్యంలో మమ్మీ ఫ్రాంఛైజీ హాలీవుడ్ లో తెరకెక్కింది. ఆ సినిమాలో రాణుల ఆహార్యం గెటప్ ని తనలోకి తెచ్చేసింది జాన్వీ కపూర్. ప్రఖ్యాత పీకాక్ మ్యాగజైన్ ముఖచిత్రంలో ఈ లుక్ తో కనిపించింది. ఈ స్పెషల్ ఫోటోషూట్ ని స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

ఇది ప్రత్యేకించి డిజైన్ చేసిన బాల్ గౌన్.. పెరివింకిల్ కలర్ తో మైమరిపిస్తోంది. ఈ డిజైన్ లో పక్షి ఈకలతో ప్రత్యేక  అలంకారం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. హై-స్లిట్ లేయర్డ్ దుస్తులలో కళాత్మక కంటెంట్ యూత్ లోకి దూసుకెళుతోంది. ఇక జాన్వీ చేతిలో ఆ హ్యాండ్ బ్యాగ్ ని చూశారు కదా.. అది కూడా ఏటికొప్పాక నిర్మల్ డిజైనర్ బొమ్మలా ఎంతో కళాత్మకంగా అందంగా కనిపిస్తోంది. జాన్వీ అందమైన ఉంగరాల జుట్టు ఆకర్షణీయంగా ఎలివేట్ అయ్యింది. అలాగే డ్యూ హైలైటర్ బోల్డ్ రెడ్ లిప్స్ ఊరిస్తున్నాయి.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాన్వి  నటించిన `దోస్తానా 2` చిత్రం సెట్స్ పై ఉంది. కార్తీక్ ఆర్యన్  ఈ చిత్రం నుండి నిష్క్రమించినట్లు ధర్మ సంస్థ ప్రకటించడంతో దోస్తానా 2 హెడ్ లైన్స్ లోకి వచ్చింది. తదుపరి జాన్వీ మరిన్ని భారీ చిత్రాల్లో నటించనుంది.