Begin typing your search above and press return to search.

నాది ఎంత పెద్ద‌దో అంటున్న సాహో భామ‌

By:  Tupaki Desk   |   17 Feb 2020 6:30 PM GMT
నాది ఎంత పెద్ద‌దో అంటున్న సాహో భామ‌
X
బాలీవుడ్ లో కిక్ చిత్రంతో జాక్విలిన్ కెరీర్ టేకాఫ్ అయి సంగ‌తి తెలిసిందే. అటుపై ఈ భామ టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సాహో చిత్రంలో అదిరిపోయే స్పెష‌ల్ నంబ‌ర్ తో రంగ ప్ర‌వేశం చేసింది. బ్యాడ్ బోయ్ అంటూ తెలుగు కుర్రాళ్ల‌కు కంటిపై కునుకు ప‌ట్ట‌నీకుండా చేసింది. ఈ సాంగ్ లో జాకీ వ‌య్యారాల వ‌డ్డ‌నలు యూత్ కి ఓ రేంజులో మ‌త్తెక్కించాయి. ఇక జాకీ నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో విరుచుకుప‌డే తీరు హాట్ టాపిక్ అనే చెప్పాలి.

రెగ్యుల‌ర్ జిమ్మింగ్ స‌హా హాట్ యోగాతో జాకీ ఇచ్చే ట్రీట్ గురించి తెలిసిందే. ఈ ఫోటోలు వీడియోలు నెటిజ‌నుల్లో నిరంత‌రం వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి. తాజాగా టిక్ టాక్ లో త‌న వీడియోని 20 కోట్ల మంది (200 మిలియ‌న్) వీక్షించార‌ని తెలిపింది జాకీ. ఈ సంద‌ర్భంగా త‌న ఫాలోవ‌ర్స్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

జాకీ కెరీర్ ని ప‌రిశీలిస్తే సాహో స్పెష‌ల్ నంబ‌ర్ త‌ర్వాత వేరొక బాలీవుడ్ మూవీ ఏదీ క‌మిటైన‌ట్టు లేదు. నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ డ్రైవ్ లో న‌టించింది. వెబ్ సిరీస్ లో జాక్విలిన్ న‌ట‌న‌కు అద్భుత స్పంద‌న వ‌చ్చింది. అలాగే హిందీలో ఎటాక్ అనే మ‌రో క్రేజీ చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమాకి ల‌క్ష్య‌రాజ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.