'ఖాళీ టైంలో తల్లి గుర్తొస్తుంది' అంటున్న జాన్వీ

Thu Aug 13 2020 17:40:11 GMT+0530 (IST)

'Mother remembers in her spare time' says Janhvi

అతిలోకసుందరి శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ లేక ఇంటికే పరిమితం అయింది. ఇటీవలే జాన్వీ నటించిన రెండో సినిమా 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' సినిమా డిజిటల్ ప్లాటుఫామ్ లో విడుదల అయింది. ఇక గత కొన్ని నెలలుగా ఇంట్లో ఉంటే ఎన్నో జ్ఞాపకాలు పురివిప్పుతున్నాయి అంటుంది జాన్వీ. అప్పుడప్పుడు ఖాళీగా సమయంలో తన తల్లి శ్రీదేవి కూడా గుర్తొస్తుందట. అయితే దఢక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయినుగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తన మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అయితే జాన్వీ హీరోయిన్ కావడంలో తల్లి శ్రీదేవి పాత్ర ఎంతో ఉంది. ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో తన రోజువారీ లైఫ్ లో జరిగే అనుభవాలను ఆలోచనలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది జాన్వీ. ముఖ్యంగా ఈ లాక్‌డౌన్‌లో భాగంగా జీవితంలో చాలా కొత్త విషయాలు అర్థం చేసుకుందట ఈ భామ."తినే ఆహారంతో పాటు ఇంట్లో నిత్యావసర వస్తువులు అయిపోతే పేదవాళ్ళు ఎంత కష్టపడతారో.. వారు తమ ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతారు. నాకు ఆ అవసరం ఎలా ఉంటుందో కూడా తెలియకుండా పెరిగాను. ఇటీవలే ఇంట్లోని ప్రతీ ఒక్కరి గురించి పట్టించుకోవాలనే ధ్యాస కలిగింది. ఇకనుండి తండ్రి ఆరోగ్యాన్ని చూసుకుంటూ.. టైంను సరిగ్గా వాడుకుంటానని" ఇదివరకే చెప్పుకొచ్చింది. అయితే ఇంట్లో ఉంటే తల్లి శ్రీదేవి గుర్తొచ్చి భావోద్వేగానికి గురవుతుందట. సోషల్ మీడియాలో జాన్వీకి మిలియన్ల సంఖ్యలో ఫాలోయింగ్ ఉంది. ఈరోజు తల్లి శ్రీదేవి పుట్టినరోజు కాబట్టి మరోసారి తల్లిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో తల్లి శ్రీదేవిని హాగ్ చేసుకొని కెమెరా వైపు చూస్తూ ఉంది. ఇది శ్రీదేవి 57వ బర్త్ డే. ఇక పోస్ట్ పై 'ఐ లవ్ యూ ముమ్మా' అని కాప్షన్ జతచేసింది. ప్రస్తుతం తల్లిబిడ్డల పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.