మారుతిలాగే గోపీచంద్ కూడా అంతకు ముందు ఒకటి!

Wed Jul 21 2021 19:00:01 GMT+0530 (IST)

it will take some time for Gopichand to make a new film under the direction of Maruti

కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్న మారుతి గత చిత్రం ప్రతి రోజు పండుగే తర్వాత అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కాస్త కరోనా వల్ల ఎక్కువ అయ్యింది. కరోనా మొదటి వేవ్ తర్వాత గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అనే సినిమాను ప్రకటించాడు. షూటింగ్ కూడా ప్రారంభించకుండానే అక్టోబర్ లో సినిమాను విడుదల చేస్తామంటూ ప్రకటించాడు. గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా తో కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. మారుతి సినిమా అంటే పక్కా కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అన్నట్లుగా టాక్ వచ్చింది. కనుక మారుతితో సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు ఇంట్రెస్ట్ గా ఉన్నారు.ఇలాంటి సమయంలో గోపీచంద్ అడిగిన వెంటనే మారుతికి డేట్లు ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. కాని కొన్ని కారణాల వల్ల పక్కా కమర్షియల్ మూవీ ప్రకటించిన తర్వాత మారుతి మరో సినిమాను చేశాడు. యూవీ క్రియేషన్స్ లో సంతోష్ శోభన్ హీరోగా మంచి రోజులు వచ్చాయి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశాడు.

మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను అతి త్వరలోనే పూర్తి చేసి థియేటర్ల ద్వారా ఈ సినిమాను విడుదల చేయాలని మారుతి భావిస్తున్నాడు. మారుతి ఈ సినిమా ను సడెన్ గా ప్రకటించడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది. ఈ సినిమా చేస్తున్నాడు కదా అని పక్కా కమర్షియల్ సినిమాను పక్కకు పెట్టలేదు. ఆ సినిమా షూటింగ్ కు త్వరలో వెళ్తారట.

ఇటీవలే గోపీచంద్ బర్త్ డే సందర్బంగా కొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. మారుతి దర్శకత్వంలో కొత్త సినిమా ను గోపీచంద్ చేసేందుకు కాస్త సమయం పడుతుందనే టాక్ వినిపిస్తుంది. అందుకే ఈ గ్యాప్ లో శ్రీ వాస్ దర్శకత్వంలో గోపీచంద్ సినిమాను చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇప్పటికే రెండు సినిమాలను శ్రీవాస్ దర్శకత్వంలో చేసిన గోపీచంద్ ఇప్పుడు మరో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈ సినిమా కు గాను హీరోయిన్ గా నభా నటేష్ ను ఎంపిక చేయడం జరిగిందట. శ్రీవాస్ స్పీడ్ చూస్తుంటే సినిమా ను వెంటనే ప్రారంభించి మూడు నెలల్లోనే పూర్తి చేసేలా ఉన్నాడట.

సినిమా ను వచ్చే ఏడాదికి విడుదల చేస్తారా లేదా ఈ ఏడాదిలోనే ఉంటుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. పెద్ద ఎత్తున అంచనాలున్న గోపీచంద్.. శ్రీవాస్ కాంబో మూవీ మరియు గోపీచంద్ సంతోష్ శోభన్ ల మూవీ లు పూర్తి అయ్యి విడుదల అయిన తర్వాత కాని మారుతి.. గోపీచంద్ ల మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని.. కాస్త ఆలస్యం అయినా కూడా ఖచ్చితంగా పక్కా కమర్షియల్ సినిమా పక్కాగా కమర్షియల్ సక్సెస్ గా నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. మారుతి ఇంకా గోపీచంద్ ల పక్కా కమర్షియల్ మూవీ గురించిన క్లారిటీ మరోసారి క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మారుతి తాజా చిత్రం మంచి రోజులు వచ్చాయికి మంచి స్పందన వచ్చింది. యూవీ వారు నిర్మిస్తున్న సినిమా అవ్వడం వల్ల మంచి రోజులు వచ్చాయి కి పాజిటివ్ బజ్ ఉంది. ఇక గోపీచంద్ నటించిన సిటీ మార్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ మూవీ కూడా ఒక మంచి కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీవాస్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుని చేస్తున్నాడు.