ఇళయరాజా తీరు ఏం బాగాలేదు!

Mon Aug 03 2020 13:00:23 GMT+0530 (IST)

ilaiyaraaja files complaint against sai prasad prasad studios

కోలీవుడ్ లో ఇళయరాజా మరియు ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ ల మద్య వివాదం కొనసాగుతున్న విషయం తెల్సిందే. ప్రసాద్ స్టూడియోలో ఉన్న ఇళయరాజా మ్యూజిక్ స్టూడియోను తొలగించేందుకు సాయి ప్రసాద్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తన స్టూడియోకు వచ్చి బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నించడంతో పాటు సంగీత పరికరాలను ద్వంసం చేశారంటూ ఇళయరాజా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ వ్యవహారంపై సినీ ప్రముఖులు స్పందించారు. ఎల్వీ ప్రసాద్ కుటుంబంకు చెందిన మూడు తరాలు కూడా సినిమా పరిశ్రమకు ఎంతో సేవ చేస్తున్నారు. స్టూడియోలను నిర్మించడంతో పాటు ఎన్నో విధాలుగా సినిమాకు సేవ చేశారని అలాంటి వారి కుటుంబంపై కోర్టుకు వెళ్లడం సబబు కాదంటూ సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కాట్రగడ్డ ప్రసాద్ అన్నారు.

ఇంతకు ముందు ఇన్ వాయిస్ చూపించి ఇళయరాజాగారు వారి సంగీత పరికరాలను తీసుకు వెళ్లారు. ఇప్పుడు మళ్లీ కేసు పెట్టడం ఏం బాగాలేదన్నాడు. ఎవరి మాటలు పట్టుకుని ఇళయరాజాగారు ఇలా చేస్తున్నారో తెలియడం లేదంటూ కాట్రగడ్డ ప్రసాదం అన్నారు. ఎల్వీ ప్రసాద్ గారి కుటుంబం పై గౌరవంతో కేసును ఉపసంహరించుకోవాలంటూ కాట్రగడ్డ విజ్ఞప్తి చేశారు. మరి దీనికి ఇళయరాజా ఎలా స్పందిస్తారనేది చూడాలి.