Begin typing your search above and press return to search.

హ‌నీ రోజ్ ముందు తేలిపోయిన‌ హ‌నీ..?

By:  Tupaki Desk   |   6 Feb 2023 9:09 PM GMT
హ‌నీ రోజ్ ముందు తేలిపోయిన‌ హ‌నీ..?
X
కొత్తొక వింత పాతొక రోత‌! అన్నారు పెద్ద‌లు. పాత‌బ‌డిపోయిన ముఖాన్ని చూసే కంటే కొత్త ముఖాన్ని చూసేందుకు ప్ర‌జ‌లు ఆరాట‌ప‌డతారు. పైగా ఒక హిట్టు అని టాక్ తెచ్చుకున్న సినిమాలో హీరోయిన్ కి ఉండే క్రేజు వేరే లెవ‌ల్. అగ్ర హీరో స‌ర‌స‌న న‌టిస్తే ఆ హీరో ఫ్యాన్స్ అంద‌రికీ చేరువ‌య్యే అవ‌కాశం ఉంటుంది.

నిజానికి అలాంటి ల‌క్ ద‌క్కించుకుంది హ‌నీరోజ్. రీఎంట్రీ నే అయినా కానీ త‌న‌ని తాను హ‌నీరోజ్ రీఫ్రెషింగ్ గా తెలుగు సినిమా తెర‌పై ప్రెజెంట్ చేసుకునేందుకు `వీర‌సింహారెడ్డి` ఎంత‌గానో స‌హ‌క‌రించింది. సంక్రాంతి బ‌రిలో ఈ సినిమా ఓపెనింగుల దూకుడుతో ఫ‌ర్వాలేద‌నిపించే విజ‌యం ద‌క్కించుకుంది.

ఇక ఈ సినిమా జ‌యాప‌జ‌యాల మాట అటుంచితే ఇందులో న‌టించిన అందాల మ‌ల్లూ భామ హ‌నీరోజ్ కు ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. మాస్ హీరో బాల‌య్య స‌ర‌స‌న మ‌ల్లూ బ్యూటీ అద‌ర‌గొట్టింద‌న్న టాక్ వినిపించింది. అంతేకాదు పోస్ట‌ర్లు.. ప్ర‌మోష‌న్స్ లోను శ్రుతిహాస‌న్ ని డామినేట్ చేస్తూ హ‌నీరోజ్ చేసిన హ‌డావుడికి నంద‌మూరి అభిమానులు వెర్రెత్తిపోయారు. కార‌ణం ఏదైనా కానీ ఇప్పుడు టాలీవుడ్ లో హ‌నీరోజ్ జ‌పం కొన‌సాగుతోంది. వ‌రుస‌గా తెలుగు రాష్ట్రాల్లో షాపుల ఓపెనింగులు రిబ్బ‌ను క‌టింగుల‌తో హ‌నీరోజ్ బిజీగా ఆర్జిస్తోంది.

తాజాగా తెలంగాణ‌లోని ఓ న‌గ‌రంలో దుకాణం లాంచింగులో రిబ్బ‌ను క‌టింగుకి వెళ్లిన‌ప్పుడు త‌న‌తో పాటే ఉన్న మెహ్రీన్ ని ప‌ట్టించుకోని జ‌నం హ‌నీరోజ్ ని చూడ‌గానే ఒక‌టే విజిల్స్ వేశారు. హనీ ప్లీజ్! అంటూ ఎంతో ప్రేమ‌గా పిలుచుకున్నారు అభిమానులు. అయితే ప‌క్క‌నే ఉన్న మెహ్రీన్ ఈ త‌తంగం అంతా చూస్తూ కూడా త‌న‌కేమీ తెలియ‌న‌ట్టే ఉండిపోయింది. దీంతో హ‌నీరోజ్ ముందు ఉన్న హ‌నీ (ఎఫ్ 3లో మెహ్రీన్ రోల్) తేలిపోయిందంటూ ప్ర‌చారం సాగుతోంది. ఓవ‌రాల్ గా ఆ ఎపిసోడ్ లో హ‌నీరోజ్ షో స్టాప‌ర్ గా నిలిచింది. అయినా అందంలో మెహ్రీన్ కి ఏం త‌క్కువ‌ని? కాజ‌ల్ త‌ర్వాత అంత‌టి అందం మెహ్రీన్ కి ఉంది. ప్ర‌తిభ ఉంది. కానీ ఎందుక‌నో ల‌క్ ఫేవ‌ర్ చేయ‌లేదు. స‌రైన అగ్ర‌హీరోల‌తో మాస్ రోల్స్ ప‌డ‌లేదు. అందువ‌ల్ల‌నే అలా అయ్యింది.

ఇక పోతే మాస్ హీరో బాల‌య్య స‌ర‌నన న‌టించడంతో హ‌నీరోజ్ కి మాస్ లో అమాంతం క్రేజ్ పెరిగింది. ఇప్పుడు టూటైర్ సిటీల్లో అడుగుపెడితే హ‌నీరోజ్ ని చూసేందుకే వీధులన్నీ బ్లాక్ అయిపోవ‌డం గ్యారెంటీ. బొద్దుగా ముద్దొచ్చే మ‌ల‌యాళీ బ్యూటీ హ‌నీరోజ్ కి ప్ర‌స్తుతం తెలుగు కుర్రాళ్ల‌లో బాగానే ఫాలోయింగ్ ఏర్ప‌డింది. దీంతో అడ్వాన్సుల‌తో సూట్ కేసులు ఇంటికి వెళుతున్నాయ‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.