సూపర్ స్టార్ - నటసింహా ఫ్రేమ్ లో ఆమె ఎవరు?

Sat Nov 21 2020 09:45:37 GMT+0530 (IST)

heroine meena with Balayya and Rajini

మీనా.. పరిచయం అవసరం లేని పేరు ఇది. 1980-90 సీజన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన బాల నటీమణులలో ఒకరు. ఆ తర్వాత 90లలో కథానాయికగా కెరీర్ ని ప్రారంభించింది. టాలీవుడ్ కోలీవుడ్ లో  స్టార్ హీరోలందరి సరసన నటించిన అగ్ర కథానాయికగా తనని తాను ఆవిష్కరించుకుంది. దక్షిణాదిలో బాలనటిగా కలుపుకుని దాదాపు 100 పైగా సినిమాలు చేసింది.సూపర్ స్టార్ రజనీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి.. నటసింహా నందమూరి బాలకృష్ణ.. కింగ్ నాగార్జున.. విక్టరీ వెంకటేష్ ఇలా అగ్ర హీరోలందరి సరసనా మీనా నటించారు.  బాలయ్య సరసన నటించిన `బొబ్బిలి సింహం` తన కెరీర్లో అతిపెద్ద విజయాలలో ఒకటి. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో అరుదైన దృశ్యమిది. ఇందులో రజనీకాంత్ బాలయ్య ఒకే ఫ్రేమ్ లో కనిపించగా.. ఆ ఇద్దరితో సరదాగా మాట్లాడేస్తున్న మీనా ఫోటో లేటెస్టుగా మరోసారి ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది.

బాలకృష్ణ- రోజా- మీనా ప్రధాన పాత్రల్లో నటించిన 1994 క్లాసిక్ చిత్రం బొబ్బిలి సింహం. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో టి. త్రివిక్రమరావు విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై నిర్మించారు. ఈ మూవీ ప్రారంభోత్సవంలోనే బాలయ్య - మీనాలతో కలిసి సూపర్ స్టార్ ఇలా సందడి చేశారు. అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించి స్టార్లు టెక్నీషియన్లకు మంచి పేరు తెచ్చింది ఈ మూవీ.