సర్కారు వారి హీరోయిన్ విషయంలో ఇంకా కన్ఫ్యూజన్

Tue Aug 04 2020 12:00:41 GMT+0530 (IST)

here are the details Of Mahesh Babu Sarkar Vari Pata Heroine

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే ఏడాది సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకుడు పరశురామ్ సన్నాహాలు చేస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో హీరోయిన్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మొదట ఈ చిత్రంకు భరత్ అనే నేను కియారా అద్వానీని సంప్రదించారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కీర్తి సురేష్ ఒక లైవ్ చాట్ లో మహేష్ బాబుతో నటించబోతున్నట్లుగా చెప్పింది.కీర్తి సురేష్ మాటలతో సర్కారు వారి పాట హీరోయిన్ కన్ఫర్మ్ అయ్యిందని ప్రచారంకు చెక్ పడ్డట్లయ్యింది. అయితే హీరోయిన్ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అంటూ నిర్మాతలు ప్రకటించడంతో మళ్లీ చర్చ మొదలైంది. తాజాగా ఈ చిత్రం కోసం అనన్య పాండేను సంప్రదించారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ ప్రేక్షకుల అటెన్షన్ సంపాదించాలంటూ ఉత్తరాది ముద్దుగుమ్మను ఈ చిత్రంలో నటింపజేయాలని అలా చేస్తేనే పాన్ ఇండియా సినిమాగా సర్కారు వారి పాట నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

కీర్తి సురేష్ మార్కెట్ సౌత్ ఇండియా వరకే పరిమితం అయ్యి ఉంది కనుక అనన్య పాండేను మహేష్ బాబుకు జోడీగా దించే యోచనలో మేకర్స్ ఉన్నారట. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నా కూడా అనన్య పాండే తెలుగులో విజయ్ దేవరకొండతో ఒక చిత్రాన్ని చేస్తోంది. పూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం దాదాపుగా సగం షూటింగ్ పూర్తి అయ్యింది. సర్కారు వారి పాట ప్రారంభం అయ్యే సమయానికి రౌడీ మూవీని అనన్య పూర్తి చేసే అవకాశం ఉంది. మహేష్ బాబుతో నటించేందుకు అనన్య చాలా ఆసక్తిగా ఉందట.