నాతో శృంగారం చేస్తే.. కోరింది ఇస్తా.. సినీనటికి వేధింపులు!

Sat May 15 2021 13:11:17 GMT+0530 (IST)

harassment to the Actress

సోషల్ మీడియాలో నటీమణులు ఎదుర్కొంటున్న వేధింపులకు అడ్డే లేకుండాపోతోంది. బాడీ షేమింగ్ మొదలు.. చివరకు శృంగారం చేయాలని అడిగే స్థాయికి చేరింది. తాజాగా.. ఓ నటికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన నటి.. తీవ్ర ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు.సామాజిక మధ్యమాల్లోని ఆవారా బ్యాచ్ మహిళా నటులను టార్గ్ చేస్తూ.. ఇష్టారీతిన కామెంట్లు చేయడం అలవాటుగా మారిపోయింది. తమను కనుక్కువోడం అంత ఈజీగా కాదన్న ధైర్యమో.. దూరంగా ఉన్నవారు తమను ఏం చేస్తారులే అన్న తెగింపో తెలియదుగానీ.. దారుణమైన కామెంట్లు పెడుతున్నారు.

ఆ మధ్య హీరోయిన్ పూజా హెగ్డేను న్యూడ్ ఫొటో అడిగాడు ఓ ఆకతాయి. దీనికి కూల్ గా దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చింది పూజా. తన పాదాలను ఫొటో తీసి పోస్ట్ చేసింది. ఆ తర్వాత యాంకర్ శ్రీముఖికి సైతం ఇదే అనుభవం ఎదురైంది. ఆమెను కూడా నగ్న చిత్రం అడిగాడు మరో బేవార్స్ బ్యాచ్ సభ్యుడు. తనదైనశైలిలో ఆన్సర్ ఇచ్చిందీ యాంకర్. రామ్ గోపాల్ వర్మ సినిమా ‘నగ్నం’ పోస్టర్ ను పోస్టు చేసి మరోసారి మాట్లాడకుండా చేసింది.

ఆ తర్వాత హీరోయిన్ ప్రియమణిని కూడా ఇలాంటి ఫొటోనే అడిగితే.. ముందు మీ అక్కను ఆ తర్వాత మీ అమ్మను పోస్ట్ చేయమని చెప్పు.. ఆ తర్వాత తాను పోస్టు చేస్తానని ఘాటు రిప్లే ఇచ్చింది. అయినప్పటికీ.. చాలా మందికి బుద్ధిరావట్లేదు. తాజాగా.. తమిళ నటి సౌందర్య నందకుమార్ ను ఏకంగా.. తనతో శృంగారం చేయాలని అడిగాడట ఓ నెటిజన్. ఆయన ఓ లెక్చరర్ కావడం గమనార్హం.

విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సౌందర్య.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ స్టా గ్రామ్ చిట్ చాట్లో తనను తాను లెక్చరర్ గా పరిచయం చేసుకున్న వ్యక్తి.. తనతో గడపాలని అడిగాడట. డబ్బులు ఎంత అడిగినా ఇస్తానని చెప్పాడట. దీనిపై సౌందర్య ఆగ్రహం వ్యక్తంచేసింది. అమ్మాయిలపై ఇలా ఇష్టారీతిన మాట్లాడేవాళ్లకు తగిన బుద్ధిచెప్పాలని మండిపడింది.

తాను అతన్ని ట్రాక్ చేస్తున్నానని ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పింది. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న అతను ఇలా చేయడంపై ఆవేదన వ్యక్తంచేసింది. ఇలాంటి వారిపట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది సౌందర్య నందకుమార్.