ఆపిల్ బ్యూటీ.. స్విమ్ సూట్ వేస్తే..!

Mon May 25 2020 23:00:02 GMT+0530 (IST)

hansika In Swimsuit

ఆపిల్ బ్యూటీ హన్సిక అంటే సౌత్ ఇండియాలో తెలియని సినీ ప్రేమికులు ఉండరు. పదహారేళ్ల వయసులోనే కుర్రకారు మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది హన్సిక. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శత్వం వహించిన దేశముదురు సినిమాతో హన్సిక హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే గ్లామరస్ నటనతో మెప్పించింది. ఆ తర్వాత హన్సిక టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయి స్టార్ హీరోల అందరి సరసన నటించింది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు తగ్గించింది. అప్పుడప్పుడూ మాత్రమే తెలుగులో సినిమాలు చేస్తోంది. హన్సిక చివరగా నటించిన చిత్రం తెనాలి రామకృష్ణ బీఏబిఎల్. సందీప్ కిషన్ కు జోడిగా నటించిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం హన్సిక హీరోయిన్ సెంట్రిక్ మూవీ 'మహా'లో నటిస్తుంది. జమీల్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హర్రర్ అంశాలు ఉండబోతున్నాయట.ఈ సినిమా దర్శక నిర్మాతలు మహా చిత్రం నుంచి ఒక్కొక్కటిగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. హన్సిక ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటూ తన క్యూట్ త్రో బ్యాక్ పిక్ అభిమానులతో షేర్ చేసింది. ఈ ఫొటోలో అమ్మడు.. మాల్దీవ్స్ లో స్విమ్ సూట్ ధరించి చేతిలో వైన్ గ్లాస్ తో అదిరిపోయే పోజ్ ఇచ్చింది. ఈ ఫొటోలో హన్సికను చూస్తే ఖచ్చితంగా మతిపోవాల్సిందే. పాలరాతి శిల్పంలా అందమైన తన పాదాల నుండి నడుము వరకు నీటిలో  మునిగేలా నిలబడింది ఈ బొద్దు గుమ్మ. ఈ ఫొటోలో హన్సిక పర్ఫెక్ట్ ఫిగర్ తో కనిపిస్తుంది. టీనేజ్ నుండి కూడా ఈ భామ ఇదే శరీర ఆకృతిని మెయింటైన్ చేస్తూ.. రోజురోజుకి అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ.. కలలరాణిగా మారింది. నిజానికి తమిళ అభిమానులకు హన్సిక ఓ అందాల దేవత. ఈ స్విమ్ సూట్ లో అమ్మడి అందం మరింత పెరిగిందని చెప్పాలి. ఇక ఈ త్రో బ్యాక్ ఫొటోలో మాల్దీవ్స్ కూడా హన్సిక అందాలకు ఫిదా అయిపోయి సైలెంట్ గా చూస్తోంది.