Begin typing your search above and press return to search.

వ‌ర్మ హీరోగా న‌టించే సినిమాలో అరియానా క‌థానాయిక‌?

By:  Tupaki Desk   |   4 Jun 2021 3:30 AM GMT
వ‌ర్మ హీరోగా న‌టించే సినిమాలో అరియానా క‌థానాయిక‌?
X
ద‌శాబ్ధాల కెరీర్ జ‌ర్నీలో ఎంద‌రో క‌థానాయిక‌ల్ని త‌న‌దైన ప‌బ్లిసిటీ స్టంట్ తో పాపుల‌ర్ చేసిన ఆర్జీవీ .. నేటికీ యువ‌త‌రం క‌థానాయిక‌ల్ని అదే ప‌నిగా ప్ర‌మోట్ చేసేందుకు వెన‌కాడ‌డం లేదు. ఆర్జీవీ డీకంపెనీలో చేరితే చాలు ఆటోమెటిగ్గా ప‌బ్లిసిటీ ఫ్రీ. ఇటీవ‌ల ఓ ఇద్ద‌రు హాట్ గాళ్స్ కి అద్భుతమైన ప్ర‌చారాన్ని క‌ల్పిస్తున్న ఆర్జీవీ ఇప్పుడు బిగ్ బాస్ బ్యూటీ అరియానాకు కావాల్సినంత ప్ర‌మోష‌న్ తెస్తున్నారు.

నిజానికి బిగ్ బాస్ ఇంటికి వెళ్ల‌క‌ముందు అరియానా ఓ ఇంట‌ర్వ్యూ కోసం ఆర్జీవీని క‌లిసారు. అప్ప‌ట్లో అరియానా డ్రెస్సింగ్ సెన్స్ థై సొగ‌సుల‌పై ఆర్జీవీ చేసిన కామెంట్ సంచ‌ల‌న‌మే అయ్యింది. ఆ త‌ర్వాతే అరియానా ఎవ‌రో బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది. బిగ్ బాస్ ఇంటి స‌భ్యురాలిగా మ‌రింత పాపులారిటీ తెచ్చుకుంది. అరియానా కోసం బిగ్ బాస్ చూసిన ఆర్జీవీ త‌న‌కు కావాల్సిన ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే.

అరియానా ప్ర‌స్తుతం పెద్ద తెర‌పై వెలిగేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంది. మ‌రోసారి వర్మను ఇంటర్వ్యూ చేసేందుకు అరియానా జిమ్ లో క‌లిసారు. అయితే ఆర్జీవీ జిమ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. తాను జిమ్ చేయ‌డ‌మే గాక అరియానాకు క‌స‌ర‌త్తులు నేర్పించారు. అందుకు సంబంధించిన ఓ ఫోటోని ఆయ‌న స్వ‌యంగా షేర్ చేశారు. వ‌ర్మ తొంద‌ర్లోనే హీరో అవుతున్న సంగ‌తి తెలిసిందే. చూస్తుంటే ఆ చిత్రంలో అరియానాకు క‌థానాయిక‌గా అవ‌కాశం ఇచ్చేశారేమోన‌నే డౌట్లు పుట్టుకొస్తున్నాయి. ఇక‌పోతే జిమ్ లో అరియానా ఫుల్ ఫోటోషూట్ ని కూడా వ‌ర్మ త్వ‌ర‌లోనే రిలీజ్ చేస్తార‌ట‌.