ఫోటోటాక్ : గాలి వారి కుక్కకూ ఏమా దర్జా

Mon Jun 27 2022 16:00:01 GMT+0530 (IST)

gali janardhana reddy watched movie 777charlie withpet dog

కన్నడ మాజీ మంత్రి అయినా కూడా గాలి జనార్థన్ రెడ్డి తెలుగు వారికి సుపరిచితుడు. మైనింగ్ కింగ్ అంటూ పేరు పొందిన గాలి జనార్థన్ రెడ్డి దేశవ్యాప్తంగా కూడా ఒక కేసు సందర్బంగా పాపులారిటీని దక్కించుకున్నాడు. మీడియాలో ఆయన మాట్లాడే మాటలు మరియు ఆయన చేతలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.తాజాగా మరోసారి గాలి జనార్థన్ రెడ్డి వార్తల్లో నిలిచాడు. ఆయన తాజాగా 777 చార్లీ అనే సినిమాను తన హోమ్ థియేటర్ లో చూస్తున్న ఫోటోలు బయటకు వచ్చారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి తాజా చిత్రం 777 చార్లీ ని గాలి జనార్థన్ రెడ్డి తన ఫ్యామిలీతో పాటు పెంపుడు కుక్కతో కలిసి సొంత థియేటర్ లో చూశాడు.

గాలి జనార్థన్ రెడ్డితో సమానంగా ఆ కుక్క కూడా ముందు సీటులో రాయల్ గా కూర్చుని సినిమా చూస్తున్న ఈ ఫోటో ను చూసి అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. గాలి వారి కుక్కకు కూడా ఎంత గొప్ప గౌరవం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటలను ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా మీమ్స్ చేస్తూ ఉన్నారు.

777 చార్లీ సినిమా ఈమద్య కాలంలో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే కన్నడ ముఖ్యమంత్రి బొమ్మై కూడా ఈ సినిమాను చూసి కన్నీళ్లు పెట్టుకున్న వార్తలు జాతీయ మీడియాలో హైలైట్ అయ్యాయి.

సినిమా విడుదల అయిన కొన్ని రోజులకు గాలి జనార్థన్ రెడ్డి ఈ సినిమాను చూశారు. పెంపుడు కుక్కతో కలిసి ఈ సినిమాను గాలి చూశారు.

ఇక గాలి జనార్థన్ రెడ్డి ఇటీవలే తన కొడుకు గాలి కిరిటీ ని హీరోగా పరిచయం చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. మొదటి సినిమా నే అయినా కూడా భారీ మొత్తంలో ఈ సినిమాకు గాలి జనార్థన్ రెడ్డి ఖర్చు పెడుతున్నాడని తెలుస్తోంది. తెలుగు తో పాటు కన్నడంలో ఏక కాలంలో ఈ సినిమా ను రూపొందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే గాలి వారి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట.