హిందీ ఫలన్ నుమా దాస్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Fri Jul 01 2022 23:00:01 GMT+0530 (IST)

falaknuma das hindi remake arjun das

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రం 'ఫలక్ నుమా దాస్'. ఆ సినిమా మలయాళం చిత్రం అంగమాలీ డైరీస్ కు రీమేక్ అనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఫలక్ నుమా దాస్ సినిమాలో హీరోగా నటించడం మాత్రమే కాకుండా దర్శకత్వం కూడా వహించిన విశ్వక్ సేన్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే సినిమా కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు.రీమేక్ లో స్టార్ కాస్టింగ్ లేకపోవడం వల్ల కమర్షియల్ గా హిట్ అవ్వలేదు కాని పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుని విశ్వక్ సేన్ కు నాలుగు అయిదు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత విశ్వక్ సేన్ బిజీ అయ్యాడు. ఇప్పుడు విశ్వక్ సేన్ ను హీరోగా నిలబెట్టిన అంగమాలీ డైరీస్ ను హిందీలో రీమేక్ చేస్తున్నారు.

ఈ రీమేక్ వ్యవహారం చాలా రోజుల క్రితమే మొదలు అయ్యింది. గత కొన్నాళ్లుగా రీమేక్ కు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా సినిమా లో విశ్వక్ సేన్ పాత్రను ఎవరు పోషించబోతున్నారు అనే విషయంలో స్పష్టత వచ్చింది. హిందీ లో ఇప్పటి వరకు పెద్దగా గుర్తింపు లేని యంగ్ నటుడిని ఈ రీమేక్ లో నటింపజేస్తున్నారు.

తమిళ స్టార్ నటుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఖైదీ.. మాస్టర్ మరియు విక్రమ్ సినిమా ల్లో కీలక పాత్రల్లో కనిపించిన కుర్రాడు అర్జున్ దాస్. మూడు సినిమా ల్లో కూడా ఇతడి పాత్ర కు మంచి మార్కులు పడ్డాయి. కేవలం తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఇతడి గురించిన చర్చ జరిగింది. అందుకే ఇప్పుడు హిందీ ఫలక్ నుమా దాస్ లో అవకాశం దక్కించుకున్నాడు.

కథ చాలా సింపుల్ గా ఉన్నా.. దాన్ని చూపించిన విధానంతో యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో అంగమాలీ డైరీస్ సక్సెస్ అయ్యింది. యూనివర్శిల్ సబ్జెట్ అవ్వడంతో ఈ సినిమా ను హిందీ లో కూడా రీమేక్ చేస్తున్నారు. మధుమితా సుందరరామన్ హిందీ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు లో గోపీచంద్ ఆక్సీజన్ సినిమా లో అర్జున్ దాస్ నటించాడు.

ఇప్పుడు అతడే హిందీ ఫలక్ నుమా దాస్ లో హీరోగా నటిస్తూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మలయాళంలో హిట్ అయ్యి.. తెలుగు లో పర్వాలేదు అనిపించుకున్న అంగమాలి డైరీస్ హిందీలో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుంది అనేది చూడాలి.