భన్వర్ సింగ్ షికావత్.. బాగా ఎక్కువైంది!

Thu Jul 07 2022 07:00:02 GMT+0530 (IST)

fahadh faasil movie news

పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షికావత్ పాత్ర ద్వారా తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరరైన ఫాహాద్ ఫాజిల్ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఈ నటుడు కావాలని చేసింది ఏమీ కాదు కానీ గత కొంతకాలంగా ఎలాంటి సినిమా చేసినా కూడా ఊహించిన విధంగా ఓటిటి ప్రపంచంలోనే విడుదలవుతున్నాయి. మంచి టాలెంట్ ఉన్న ఈ హీరో సినిమాలు థియేటర్లో మాత్రం విడుదల కావడం లేదు. దీంతో ఎగ్జిబిటర్లు అతనిపై చాలా కోపంగానే ఉన్నారు.ఫాహద్ సోలో హీరోగా 2020లో థియేటర్స్ లో రిలీజైన చివరి మూవీ ట్రాన్స్. ఇది కేరళలో సక్సెస్ ఫుల్ మూవీగా రికార్డులు నమోదు చేసుకుంది. ఒక విధంగా ఫాహాద్ కు మలయాళ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ అయితే ఉంది.

అతను ఎలాంటి సినిమాలు చేసిన కూడా భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ అయితే అందుకుంటున్నాయి. కానీ ఫాహాద్ హీరోగా చేసిమా చివరి నాలుగు సినిమాలన్నీ కూడా ఓటీటీ లోనే వచ్చాయి.

సీయూ సూన్ ఇరుల్ జోజి మాలిక్ ఇవన్నీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ముఖ్యంగా ఇరుల్ మాలిక్ సినిమాలు థియేట్రికల్ గా మంచి హైప్ క్రియేట్ చేసినవే. కానీ నిర్మాతలు రిస్క్ చేయలేక ఓటీటీ సంస్థలకు అమ్మేసుకొని సేఫ్ జోన్ లో పడ్డారు. కరోనా పరిస్థితులు కూడా అందుకు ఒక కారణం అని చెప్పవచ్చు.

అలాగే కొన్ని భాషలకు రీమేక్ హక్కులు కూడా అమ్మేశారు. డైరెక్ట్ డిజిటల్ కు ఇవ్వడం వల్ల సుమారు వంద కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ ని కోల్పోయినట్ల ఫాసిల్ మీద అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

ఇక అందరూ ఆగ్రహంతో ఉన్న సమయంలో ఫాహాద్ నుంచి మరో సినిమా మలయన్ కుంజుని కూడా ఓటిటికే అమ్మేశారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనుకోకుండా థియేట్రికల్ రిలీజ్ కు నోచుకోకపోవడంతో అతని పై ఇప్పుడు ఎగ్జిబ్యూటర్స్ అందరూ కూడా నిషేధం విధించాలని ఆలోచనలో పడ్డట్లు టాక్ వస్తోంది. ఫాసిల్ బిగ్ స్క్రీన్ మీద కనిపించింది కేవలం పుష్ప విక్రమ్ సినిమాల్లో మాత్రమే. వాటిలో బన్నీ కమల్ హాసన్ లు హీరోలు కాగా ఫాహాద్ నెగిటివ్ సపోర్ట్ రోల్స్ తో కనిపించాడు.