Begin typing your search above and press return to search.

2021 జ‌న‌వ‌రిలో F3 కి జేగంట మోగిస్తార‌ట‌

By:  Tupaki Desk   |   29 Sep 2020 8:12 AM GMT
2021 జ‌న‌వ‌రిలో F3 కి జేగంట మోగిస్తార‌ట‌
X
ఫ‌న్ ఫ్రస్టేష‌న్ అంటూ అనీల్ రావిపూడి గ్యాంగ్ చాలానే ర‌చ్చ చేశారు. విక్ట‌రీ వెంక‌టేష్ - వ‌రుణ్ తేజ్ జోడీ పండించిన కామెడీ ప‌రాకాష్ట‌లో అల‌రించింది. ఇందులో త‌మ‌న్నా మెహ్రీన్ గ్లామ‌ర్ రోల్స్ పెద్ద అస్సెట్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియెన్ కి సంక్రాంతి ట్రీట్ అదిరిపోయింద‌న్న చ‌ర్చా అప్పుడు సాగింది.

ఆ త‌ర్వాత ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందంటూ అనీల్ రావిపూడి - దిల్ రాజు బృందం అధికారికంగానే ప్ర‌క‌టించారు. దానిపై ప‌ని కూడా మొద‌లెట్టారు రావిపూడి. అయితే ఎఫ్ 3 ప్రారంభ‌మ‌య్యేదెపుడు? అంటే దానిపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ ఏ క్లారిటీని ఇవ్వ‌లేదు.

ఎఫ్ 3పై విక్ట‌రీ వెంకటేష్ ఎటువంటి స్పష్టత ఇవ్వక‌పోవ‌డంతో అనిల్ రావిపుడి కొత్తవారితో ఒక చిత్రాన్ని ప్రారంభించాలని యోచిస్తున్న‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. కానీ అవేవీ నిజాలు కాద‌ని.. ఎఫ్ 3 కోసం ప్లాన్ చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సేమ్ టీమ్ తోనే ఎఫ్ 3కి పని చేయనున్నారు. 2021 జనవరి నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని దర్శకుడు భావిస్తున్నార‌ట‌. అప్పటికి వెంకీ .. వరుణ్ తేజ్ ప్ర‌స్తుత సినిమాల్ని పూర్తి చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అనిల్ రవిపుడి ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించార‌ని స‌మాచారం. ఐదు నెలల్లోనే వేగంగా పూర్తి చేసి... 2021 వేసవి చివరలో విడుదల చేయాల‌న్న‌ది ప్లాన్.