మహేష్ మాసు.. బన్నీ క్లాసు మధ్య మంచివాడి సంగతి?

Mon Jan 13 2020 11:34:49 GMT+0530 (IST)

entha manchi vadavura releasing on 15 january 2020

సంక్రాంతి సినిమాలు మొత్తం నాలుగు.. వాటిలో ఇప్పటికే మూడు విడుదలయ్యాయి. రజనికాంత్ 'దర్బార్'..  మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' ఇప్పటికీ రిలీజ్ కాగా కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా' 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సంక్రాంతి సినిమాలలో పెద్దగా హైప్ లేకుండా వస్తున్న సినిమా ఇదే. మరి ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
 
రజనికాంత్ 'దర్బార్ ను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకో లేదు. కలెక్షన్స్ నామమాత్రంగానే ఉన్నాయి.  మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు యావరేజ్ రివ్యూస్.. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగా ఉన్నాయి.  సంక్రాంతి శెలవుల ఎడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఈ వసూళ్ల జోరు మరికొన్ని రోజు కొనసాగే అవకాశం ఉంది.  సంక్రాంతి హాలిడేస్ పూర్తయితే కానీ 'సరిలేరు నీకెవ్వరు' రేంజ్ తెలిసే అవకాశం లేదు. ఇక అల్లు అర్జున్ సినిమా 'అల వైకుంఠపురములో' కు ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వచ్చింది. త్రివిక్రమ్ బ్రాండ్ తో అల్లు అర్జున్ క్రేజ్ తోడవడంతో ఈ సినిమా దుమ్ము లేపడం ఖాయమని అంటున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ కానున్న 'ఎంత మంచివాడవురా' కు ఎంతమంది ప్రేక్షకులు ఓటేస్తారనేది సినిమాకు వచ్చే టాక్ ను బట్టే తెలుస్తుంది.ఎందుకంటే ఇప్పటి వరకూ ప్రేక్షకులకు ఫస్ట్.. సెకండ్ ఛాయిస్ గా అల్లు అర్జున్.. మహేష్ బాబు సినిమాలే ఉన్నాయి.  ఈ సినిమాలు దాటి కళ్యాణ్ సినిమాను చూడలంటే తప్పని సరిగా సూపర్ హిట్ టాక్ రావాలి. లేకపోతే మంచి వాడికి కష్టమే అంటున్నారు.  ఈ సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్న 'శతమానం భవతి' లాంటి హిట్ సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్నప్పటికీ 'శ్రీనివాస్ కళ్యాణం' తో నిరాశపరిచాడు. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించగలడా లేదా అనేది చూడాలి.