Begin typing your search above and press return to search.

అమెజాన్ ప్రైమ్ చేతికి 'ఏక్ మినీ కథ'..?

By:  Tupaki Desk   |   12 May 2021 11:42 AM GMT
అమెజాన్ ప్రైమ్ చేతికి ఏక్ మినీ కథ..?
X
కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ డైరెక్ట్ ఓటీటీ రిలీజులు ఊపందుకునే రోజులు వస్తున్నాయి. పెద్ద సినిమాలు కొంత కాలం వేచి చూసే ధోరణిలో ఉన్నా చిన్న సినిమాలు మాత్రం ఓటీటీ బాట పట్టాలని చూస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇచ్చి వాయిదా పడిన కొన్ని సినిమాలు.. ఇప్పటికే డిజిటల్ వేదికలలో విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో 'ఏక్ మినీ కథ' చిత్రాన్ని కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై 'ఏక్ మినీ కథ' సినిమా రూపొందింది. 'పేపర్ బాయ్' ఫేమ్ సంతోష్ శోభన్ - కావ్యా థాపర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషించారు. దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో వాయిదా పడింది. థియేటర్లు తెరుచుకుని ఎప్పటిలాగే సినిమాలు రిలీజ్ అయ్యే సిచ్యుయేషన్ లేకపోవడంతో ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ కి ఇచ్చారని టాక్.

ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దాదాపు తొమ్మిది కోట్లు చెల్లించి 'ఏక్ మినీ కథ' ను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా వల్ల నిర్మాతలకి ఐదు కోట్ల వరకు లాభం చేకూరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అడల్డ్ కామెడీ టచ్ ఉన్న స్టోరీ కాబట్టి ఓటీటీకి ఇచ్చేయడం సరైన నిర్ణయమనే అభిప్రాయాలు సినీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. మే నెలలోనే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ కి పెట్టనున్నారట. దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే.