Begin typing your search above and press return to search.

ఆ బ్లాక్‌ బస్టర్‌ సినిమా లో ముందు విజయే హీరో.. కానీ వదులు కున్నాడు : శంకర్

By:  Tupaki Desk   |   16 Sep 2020 9:50 AM GMT
ఆ బ్లాక్‌ బస్టర్‌ సినిమా లో  ముందు  విజయే హీరో.. కానీ  వదులు కున్నాడు : శంకర్
X
యాక్షన్ కింగ్ అర్జున్ హీరో, మనీషా కొయిరాలా హీరో హీరోయిన్‌లు గా కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం ముదల్వాన్‌(తెలుగులో ఒకే ఒక్కడు) సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. 1999లో విడుదల అయిన ఈ సినిమా కలెక్షన్ల తో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించింది. ఈ సినిమాతో అర్జున్ కి వచ్చిన స్టార్డం అంతా ఇంతా కాదు. తెలుగులోనూ ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ మార్మోగుతుంటాయి. ఏఆర్ రెహమాన్ అదిరి పోయే మ్యూజిక్ ఇచ్చాడు.

ఒకే ఒక్కడు సినిమాలోని ఒక్క రోజు సీఎం అన్న కాన్సెప్ట్‌ అందరికీ నచ్చింది. ఆ తరువాత పలు సినిమాల్లో ఆ కాన్సెప్ట్ ని వాడుకున్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన సినిమాలో మొదట హీరో అర్జున్ కాదట. దర్శకుడు శంకర్ ఈ మూవీని దళపతి విజయ్‌తో తీయా లనుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల విజయ్‌ ఈ సినిమాను వద్దనుకున్నారు. ఆ తర్వాత ఆ కథను శంకర్ అర్జున్ కు వినిపించడం..ఆయనకు బాగా నచ్చడంతో పట్టాలెక్కించారు. అయితే ఈ సినిమాను విజయ్ ఎందుకు వద్దనుకున్నారో చెబుతూ ఆనాటి సంగతులను శంకర్ వెల్లడించారు.

ముందుగా ఒకే ఒక్కడు స్క్రిప్ట్ సిద్ధం చేసిన శంకర్ కథ వినిపించేందుకు మొదట విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ దగ్గరకి వెళ్లారట. ఆయనకు ఈ కథ బాగా నచ్చినప్పటికీ విజయ్‌ అప్పటికే మరిన్ని ప్రాజెక్ట్‌లను ఒప్పుకుని ఉండటంతో డేట్లు క్లాష్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ సూపర్ హిట్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో చాలా ఏళ్ల వరకు సినిమా రాలేదు.

బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన త్రీ ఇడియట్స్ మూవీ శంకర్ కు నచ్చడంతో ఆ సినిమాను ఆయన తమిళ్ లో విజయ్ హీరోగా రీమేక్ చేశారు. అదే నన్బన్‌. తెలుగులో స్నేహితుడు పేరుతో విడుదలైంది. అయితే ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం శంకర్ కమలహాసన్ తో భారతీయుడు-2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఒకే ఒక్కడు సీక్వెల్ తీయాలని శంకర్ అనుకుంటున్నారట. ఈ సినిమా కోసం విజయ్ ని తీసుకోవాలని ఆయన భావిస్తున్నారట. అయితే ఈసారైనా విజయ్ ఓకే చెప్తారా లేదా అని దళపతి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.