Begin typing your search above and press return to search.

జూన్ 18న నాని ‘దారే లేదా’ మ్యూజిక్‌ వీడియో..!

By:  Tupaki Desk   |   16 Jun 2021 1:12 PM GMT
జూన్ 18న నాని ‘దారే లేదా’ మ్యూజిక్‌ వీడియో..!
X
నేచురల్‌ స్టార్‌ నాని డాక్టర్స్ - హెల్త్ వర్కర్స్ వంటి ఫ్రంట్‌ లైన్ వారియర్స్ కోసం ‘దారే లేదా’ అనే స్ఫూర్తి దాయకమైన మ్యూజిక్‌ వీడియోను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ పతాకంపై నాని సమర్పిస్తున్న ఈ సాంగ్ కోసం యంగ్‌ ప్రామిసింగ్‌ హీరో సత్యదేవ్‌ - రూప కడువయుర్‌ కూడా చేతులు కలిపారు. అలాగే ఛాయ్‌ బిస్కేట్‌ ఈ సాంగ్‌ ఎగ్జిక్యూషన్‌ బాధ్యతలను నిర్వర్తిస్తోంది.

కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ ఎన్నో త్యాగాలు చేశారు. తమ కుటుంబ సభ్యుల ప్రేమకు దూరమయ్యారు. కోవిడ్‌ బాధితుల సంక్షేమమే బాధ్యతగా భావించి అంకిత భావంతో పని చేశారు. తమ జీవితాలను పణంగా పెట్టడంతో పాటు.. తమ కుటుంబ సభ్యుల జీవితాలను కూడా రిస్క్‌ లో పెట్టి, కోవిడ్‌ బాధితులకు అద్భుతంగా సేవలు అందించి, చాలామంది ప్రజల జీవితాలను కాపాడిన ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్ కు ఈ ‘దారే లేదా’ స్పెషల్‌ సాంగ్‌ ను అంకితం ఇస్తున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.

‘దారే లేదా’ వీడియో సాంగ్ తెలుగు తమిళ భాషల్లో జూన్ 18న సాయంత్రం 4గంటల 32 నిమిషాలకు విడుదల కానుంది. తాజాగా ఈ సాంగ్‌ కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ వదిలారు. ఇందులో ఓ సోషల్‌ మీడియా యాప్‌ లో భార్యా భర్తలైన సత్యదేవ్ - రూప చాటింగ్ రూపంలో మాట్లాడుకుంటున్నారు. వారి మ్యారేజ్‌ యానీవర్సరీ సందర్భంగా ఒకరినొకరు కలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నట్లు ఈ పోస్టర్‌ లో కనిపిస్తుంది.

విజయ్‌ బుల్గానిన్‌ ‘దారే లేదా’ పాటకు సంగీతం సమకూర్చారు. లిరిసిస్ట్ కె.కె(కృష్ణకాంత్) దీనికి స్పూర్తి దాయకమైన సాహిత్యం అందించారు. తమిళ వెర్షన్ కు మదన్ కార్కి లిరిక్స్ రాశారు. వివిధ ప్రాజెక్ట్స్‌ తో బిజీగా ఉన్న నాని - వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న సత్యదేవ్.. ఫస్ట్‌ మ్యూజిక్‌ వీడియో ద్వారా కోవిడ్‌ సమయంలో సేవలు అందించిన ఫ్రంట్‌ లైన్ వారియర్స్ కృషికి ఇస్తున్న ప‌ర్‌ ఫెక్ట్ ట్రిబ్యూట్‌ అని చెప్పవచ్చు.