హిందీ సింగిల్ తో దూసుకొస్తున్న రాక్ స్టార్

Wed Sep 28 2022 08:00:02 GMT+0530 (India Standard Time)

devi sri prasad composes bollywood movie

హిందీ పాప్ సింగర్స్ లో ప్రముఖులెందరో. లక్కీ అలీ - కేకే- షాన్- ఇమ్రాన్ హష్మి మొదలు నేటితరంలో బాద్ షా- హనీ సింగ్ వరకూ ఎందరో గొప్పగా యువతరంలో ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. కానీ అందరినీ రేసులో వెనక్కి నెట్టేందుకు ఇప్పుడు మరొక ట్యాలెంటెడ్ గయ్ బరిలో దిగుతున్నారు. అతడు తెలుగు వాడు.. పరిశ్రమలతో సంబంధం లేకుండా అన్ని చోట్లా పక్కా చార్ట్ బస్టర్లతో దేశంలోనే అరుదైన ట్రాక్ రికార్డ్ ను కలిగి ఉన్నవాడు కావడంతో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఓవైపు సల్మాన్ - అజయ్ దేవగన్ - అక్షయ్ వంటి స్టార్ల సినిమాలకు కమిటవుతున్న ఆ తెలుగు ట్యాలెంట్ గురించి పరిచయం అవసరం లేదు. అతడే ది గ్రేట్ దేవీశ్రీ ప్రసాద్. ఇటు తెలుగు అటు హిందీలో ఫుల్ బిజీగా ఉన్న దేవీశ్రీ తదుపరి పుష్ప 2 కోసం `పుష్ప1`ని మించిన చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇవ్వాలని తపిస్తున్నాడు.

ఇంతలోనే దేవి శ్రీ ప్రసాద్ తన మొదటి హిందీ సింగిల్ ని  లాంచ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడని తెలిసి ఆశ్చర్యపోవడం అభిమానుల వంతు అయ్యింది. పుష్ప: ది రైజ్  విజయం తర్వాత దేవి శ్రీ ప్రసాద్ (DSP) రేంజు మరో లెవల్ ని టచ్ చేసింది. అదే క్రమంలో సరికొత్త ప్రయత్నంతో అందరికీ షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

దక్షిణాదిన 100పైగా సినిమాలకు పనిచేసిన  దేవీశ్రీకి హిందీ పరిశ్రమలోనూ గొప్ప గుర్తింపు ఉంది. సల్మాన్ కోసం అతడు `దింక చికా..`  (రెడీ) అనే చార్ట్ బస్టర్ ఐటమ్ పాటను అందించాడు. జై హో కోసం నాచో రే అంటూ సాగే పాటను అతడు అందించాడు. అలాగే డాడీ మమ్మీ .. (భాగ్ జానీ).... `సీటీ మార్` (రాధే) వంటి పలు హిందీ చార్ట్ బస్టర్లను తన ఖాతాలో వేసుకున్నారు.

`పుష్ప: ది రైజ్` ఆల్బమ్ పాన్ ఇండియా కేటగిరీలో దేవీని ఓవర్ నైట్ సెన్సేషన్ గా మార్చిందని చెప్పాలి. పుష్ప నుంచి శ్రీవల్లి -ఊ అంటావా-సామి సామి లాంటి చార్ట్ బస్టర్లు దేవీపై గౌరవం పెంచాయి. అదే క్రమంలో T-సిరీస్  సంస్థ అతడిని పాప్ ఆల్బమ్ కోసం లాక్ చేసిందని తెలిసింది. మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.  అయితే హిందీలో ఎన్నో క్లాసిక్ పాప్ సింగిల్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కొట్టేలా అదిరిపోయే ఆల్బమ్ ని దేవీశ్రీ అందించాల్సి ఉంటుంది. నోరా ఫతేహి- రకుల్ ప్రీత్ లాంటి భామలు సింగిల్ ఆల్బమ్ ల కోసం యోయో హనీ సింగ్ సహా గొప్ప ట్యాలెంట్ ని ఆశ్రయించారు. అంతకుమించి దేవీశ్రీ చెలరేగుతాడేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.