Begin typing your search above and press return to search.

న‌లుగురు పిల్ల‌ల స్టార్ వైఫ్ విడాకులపై ఇండ‌స్ట్రీలో హాట్ డిబేట్

By:  Tupaki Desk   |   21 Feb 2021 8:30 AM GMT
న‌లుగురు పిల్ల‌ల స్టార్ వైఫ్ విడాకులపై ఇండ‌స్ట్రీలో హాట్ డిబేట్
X
ఏడేళ్ల సంసార బంధంలో క‌ల‌త‌లొచ్చాయి. న‌లుగురు పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు కూడా. కానీ ఆ సెల‌బ్రిటీ బంధానికి విడాకుల‌తో ముగింపు ప‌లికేస్తుండ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ ఎవ‌రీ సెల‌బ్రిటీ క‌పుల్? అంటే..

కిమ్ కర్దాషియాన్ వెస్ట్ తన భర్త కాన్యే వెస్ట్ నుండి విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఊహాగానాలను నిజం చేస్తూ.. కిమ్ కర్దాషియన్ కాన్యే వెస్ట్ తో ఏడు సంవత్సరాల బంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. నిజానికి ఆ ఇద్ద‌రూ ఎప్పుడూ మీడియాకి హాట్ టాపిక్కే. వారి వివాహం మొద‌లు ప‌రిశ్ర‌మ కొలీగ్స్ తో వివాహాత‌ర సంబంధాల కార‌ణంగానూ వార్త‌ల‌కెక్కారు. కిమ్ కర్దాషియాన్ - కాన్యే వెస్ట్ లు 2002 నుంచి మంచి స్నేహితులు. గాయకుడు బ్రాందీ వీరిని ఒక‌రికొక‌రిని పరిచయం చేశారు. 2014 మేలో ఇటలీ- ఫ్లోరెన్స్ ‌లోని ఫోర్టే డి బెల్వెడెరేలో వీరి పెళ్ల‌య్యింది. వివాహ వేడుక‌ల కోసం ఏకంగా $ 2.8 మిలియన్లను ఖ‌ర్చు చేశారు. వివాహం చేసుకోవడానికి ముందు వారు రెండేళ్ల పాటు డేటింగ్ చేశారు.

కిమ్ కర్దాషియాన్ ఇంతకుముందు 2003 లో సంగీతజ్ఞుడు కం నిర్మాత డామన్ థామస్ ని .. 2013 లో ఎన్ బిఎ ప్లేయర్ క్రిస్ హంఫ్రీస్ ను పెళ్లాడారు. ఆ త‌ర్వాత విడాకులు తీసుకున్నారు. కాన్యే వెస్ట్ కూడా డిజైనర్ అలెక్సిస్ ఫైఫర్ .. మోడల్ అంబర్ రోజ్ లతో రిలేష‌న్ లో ఉన్నారు.

కిమ్ - కాన్యేల వివాహం చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. అనేక చిన్న ప్రదర్శనల తర్వాత 2016 లో పాప్ కళాకారుడు కెన్యే తన పాబ్లో పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేశాడు. అతను అమెరికా అధ్య‌క్షుడి ఎన్నిక‌ల్లో డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి తన మద్దతును ప్రకటించాడు. తరువాత మానసిక అత్యవసర పరిస్థితి వ‌ల్ల‌ ఆసుపత్రి పాలయ్యాడు. త‌ర్వాత కోలుకోవ‌డానికి చాలా కాల‌మే ప‌ట్టింది.

కీపింగ్ అప్ విత్ కర్దాషియన్స్.. కెకెడబ్ల్యు ఫ్రాగ్రెన్స్.. కెకెడబ్ల్యు బ్యూటీ, .. కిమ్ కర్దాషియన్: హాలీవుడ్... వంటి కార్య‌క్ర‌మాల‌తో ఎంతో పాపుల‌ర్. కాన్యే వెస్ట్ ఒక ప్రసిద్ధ సమకాలీన హిప్-హాప్ పాప్ కళాకారుడు.