అక్కినేని వారి ‘మనం’ గుర్తుకు తెచ్చేలా దగ్గుబాటి వారి ఫ్యామిలీ ప్యాక్

Thu Jul 22 2021 09:22:49 GMT+0530 (IST)

daggubati family multi starrer

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ పోషించే కీ రోల్ అంతా ఇంతా కాదు. ఎంత టాలెంట్ ఉన్నప్పటికి బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉంటే.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం కాస్తంత ఈజీ అవుతుంది. బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు ఓకే అనేస్తారా? అన్నది కూడా ప్రశ్నే. కాకుంటే.. ఫ్యామిలీ పిల్లర్ లా పని చేస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది వెనుక వారిలో సొంతంగా ఎదిగిన వారు వేళ్ల మీద లెక్కబెట్టేంత మందే ఉంటే.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారే బోలెడంతమంది కనిపిస్తారు.ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ కుటుంబాల్లో ఒకటి దగ్గుబాటి. సినిమా నిర్మాణంలో వారికి తిరుగులేదు. సినిమాను బిజినెస్ మాడ్యూల్ లో వారు అర్థం చేసుకున్నంత బాగా చాలా తక్కువ మందే అర్థం చేసుకున్నారని చెబుతారు. అలాంటి ఫ్యామిలీ నుంచి విక్టరీ వెంకటేశ్ నటుడిగా తన సత్తా చాటటం తెలిసిందే. అనూహ్యంగా నటుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్ అన్న కొడుకు రానా.. తన సత్తా ఏమిటో ఇప్పటికే చూపించారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రోటీన్ కు భిన్నమైన క్యారెక్టర్లు చేయటం.. చాలామంది హీరోలు చెప్పే మాటలకు భిన్నంగా ఆయన తీరు ఉంటుంది. తాజాగా రానా సోదరుడు అభిరాంను వెండితెరకు పరిచయం చేయనున్నారు. నటుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన తన తమ్ముడి గురించి రానా తాజాగా మాట్లాడుతూ.. వాడి ప్రయాణం వాడిదని.. ఇది చేయ్.. అది చేయ్.. ఇలా వెళ్లు.. అలా వెళ్లు అని ఇంట్లో చెప్పటం ఉండదన్నారు. ఏ పని చేసినా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతామని నమ్ముతామన్నారు. అభిరామ్ బలం ఏమిటో ప్రేక్షకులే చెప్పాలని పేర్కొన్నారు.

తమ ఇంటి ఆర్టిస్టులతో కలిసి మనం సినిమా కాదు కానీ కొత్త జోనర్ లో సినిమా ఉంటుందన్న విషయాన్ని వెల్లడించారు రానా. మొత్తానికి ‘మనం’ ప్రస్తావన వచ్చిందంటే.. ఆ కోవలో కాకున్నా.. దగ్గుబాటి వారి ఫ్యామిలీ ప్యాక్ ఒకటి రానున్న విషయంపై క్లారిటీ ఇచ్చారని చెప్పాలి. మొత్తంగా దగ్గుబాటి వారిని ఒకే సినిమాలో చూసే అవకాశం ఉంటే సదరు మూవీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి..దాని అప్డేట్ ఎవరిస్తారో చూడాలి.