Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కు సీతూ పాప రిక్వెస్ట్

By:  Tupaki Desk   |   7 July 2020 8:30 AM GMT
ఫ్యాన్స్ కు సీతూ పాప రిక్వెస్ట్
X
సోషల్ మీడియాలో మహేష్ బాబు కూతురు సితార కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్నేహితురాలు ఆద్య తో కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహించడం తో పాటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. ఈ క్యూట్ పిల్లలు ఇద్దరు కూడా అక్కడ తమ అభిప్రాయాలను ఆలోచనలు ఆటలను షేర్ చేస్తూ ఉంటారు.

తాజాగా వీరు ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియో లో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా బయటకు వెళ్తే మాస్క్ ధరించారు. సామాజిక దూరం పాటిస్తూ ఉండాలని సూచించారు. ఇదే సమయంలో మాస్క్ ధరించి ఉన్న ఫోటోలను మాతో షేర్ చేసుకోమంటూ కూడా విజ్ఞప్తి చేశారు. చిన్నపిల్లలు అయినా కూడా వీరు మాస్క్ లపై అవగాహన కల్పించడం తో పాటు అందరూ పాటించాలని విజ్ఞప్తి చేయడం నిజంగా అభినందనీయం.