Begin typing your search above and press return to search.

నాని 'దసరా' చిత్రం క్రేజీ రూమర్‌

By:  Tupaki Desk   |   19 Jan 2022 6:55 AM GMT
నాని దసరా చిత్రం క్రేజీ రూమర్‌
X
నాని హీరోగా తెరకెక్కి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్యామ్‌ సింగ రాయ్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా వసూళ్ళ పరంగా కూడా బయ్యర్లకు మరియు నిర్మాతలకు సంతృప్తి కలిగించింది అనడంలో సందేహం లేదు. ఇక నాని హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న సినిమాలు ఆయన స్థాయిని మరింతగా పెంచే విధంగా ఉండబోతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే నాని ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఒకటి అంటే సుందరానికి.. ఈ సినిమాలో నాని పాత్ర వైవిధ్యభరితంగా ఉండబోతుందని ఇప్పటికే తేలిపోయింది. ఖచ్చితంగా అంటే సుందరానికి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా నానికి కొత్త ఇమేజ్ ను తెచ్చి పెడుతుందని అంటున్నారు. ఇదే సమయంలో దసరా సినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.

శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా రూపొందబోతన్న 'దసరా' సినిమా షూటింగ్‌ స్పీడ్‌ గా జరగుతోంది. సినిమా చిత్రీకరణ ప్రారంభించకుండానే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్ ను రివీల్‌ చేయడం జరిగింది. ఫస్ట్‌ లుక్‌ తోనే నాని పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతుందేమో అంటూ అందరిలో ఒక ఆలోచన కలిగించేలా మేకర్స్ సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు సినిమాలో నాని నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నాని దసరా సినిమాలో సరికొత్త అవతారంలో కనిపించనున్నాడని.. అతడి నెగటివ్ లుక్ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

నాని 25వ సినిమా 'వి' లో విలన్ గా కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ సినిమా లో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించలేదు. అందులో మెయిన్ హీరోగానే నాని కనిపించాడు. కనుక దసరా సినిమాలో అయినా నాని ని పూర్తి స్థాయి విలన్ గా చూస్తామేమా అనేది ఆసక్తికరంగా మారింది. నాని ఈమద్య కాలంలో వరుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే సుందరానికి మరియు దసరా సినిమా లను ఇదే ఏడాది లో నాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడేమో చూడాలి. ఈ రెండు సినిమాలతో నాని స్థాయి మరింత పెరగడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.