2021 సాయిపల్లవి ఖాతాలో పడాలంటే.!

Mon May 10 2021 08:00:01 GMT+0530 (IST)

covid became a problem to Sai pallavi movies

మలయాళం బ్యూటీ సాయిపల్లవి కెరీర్ జెట్ స్పీడ్ తో సాగిపోతుంది. టాలీవుడ్ లో ఈ భామ కెరీర్ వెనుదిరిగి చూసే పని లేకుండా వెలుగుతోంది. కెరీర్ మిడిల్ లో కొన్ని పరాజయాలు ఎదురైనా అమ్మడి స్పీడ్ కు మాత్రం టాలీవుడ్ లో బ్రేకులు లేవనే చెప్పాలి. మాతృభాష మలయాళం నుంచి కోలీవుడ్ నుంచి వచ్చే అవకాశాల్ని సైతం పక్కనబెట్టి తెలుగు సినిమాల్ని టార్గెట్ చేసిన ఈ అమ్మడు కెరీర్ పరంగా ముందుకు సాగిపోతోంది. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూనే తనదైన మార్క్ పెర్పామెన్స్ తో యూత్ ని హీటెక్కిస్తోంది. యువ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ అంతా ఈ భామతో నటించాలని ఉత్సాహం చూపిస్తున్నారు.వచ్చిన ఏ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ని బ్యాలెన్సింగ్ గా సాగిస్తోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో నటిస్తోంది. రానా సరసన `విరాట పర్వం` లో సాయిపల్లవి నక్సలైట్ పాత్రలో నటించింది. టీజర్ ట్రైలర్ చూశాక ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరనోనా కారణంగా వాయిదా పడింది. అలాగే నాగచైతన్య `లవ్ స్టోరీ`లో నటించింది. `ఫిదా` తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తోన్న చిత్రం కావడంతో ఈసినిమాపై అంచనాలు స్కైని తాకాయి. ఈ సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. సెకండ్ వేవ్ తగ్గాక ఈ సినిమాలు రిలీజ్ లకు సిద్ధమవుతాయని భావిస్తున్నారు.

మరోవైపు నేచురల్ స్టార్ నాని సరసన `శ్యామ్ సింఘరాయ్`లో సాయిపల్లవి నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన మాతాజీ లుక్ ఆకట్టుకుంటోంది. నానీతో `ఎంసీఏ` తర్వాత నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ కాంబోలో మళ్లీ హిట్ పడడం ఖాయమనే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఏడాది చివరిలో రిలీజ్ కావాల్సి ఉండగా ప్రస్తుతానికి కోవిడ్ సమస్యాత్మకంగా మారింది. మొత్తానికి ఈ మూడు సినిమాలతో సాయిపల్లవి లీడ్ లో ఉంది. 2021 అందరికీ కరోనాతో కష్టకాలం.. కానీ వైరస్ వ్యాప్తి తగ్గి సినిమాలు రిలీజైతే మునుపటిలా టాలీవుడ్ ఊపందుకుంటుందనే హోప్ అందరిలో ఉంది.