Begin typing your search above and press return to search.

కళ్లు చెదిరిపోయే కమెడియన్ అలీ ఇల్లు!

By:  Tupaki Desk   |   25 Sep 2021 5:30 AM GMT
కళ్లు చెదిరిపోయే కమెడియన్ అలీ ఇల్లు!
X
సినిమా స్టార్స్ కి లభించే క్రేజ్ వేరు .. ఒకప్పుడు తిరుపతి వెళ్లిన వారు అటు నుంచి అటు చెన్నై వెళ్లి ఎన్టీ రామారావును చూసేవారు. అలా తన కోసం వచ్చినవారిని కలవడానికి ఆయన ఉదయాన్నే కొంత సమయాన్ని కేటాయించేవారు. ఎన్టీఆర్ ను చూశాము .. ఆయన ఇల్లు చూశాము అనే ఒక సంతోషంతో .. సంతృప్తితో వాళ్లు వెనుదిరిగేవారు. కానీ ఇప్పుడు తమ అభిమాన నటీనటుల ఇళ్లను .. వాకిళ్లను చూడటానికి వాళ్ల గడపవరకూ వెళ్ల వలసిన అవసరం లేదు. తమ ఇంట్లో కూర్చొనే వాళ్ల ఇళ్లను చూడవచ్చు .. బోనస్ గా వాళ్ల లైఫ్ స్టైల్ ను కూడా తెలుసుకోవచ్చు.

యూ ట్యూబ్ వచ్చిన తరువాత .. ట్రెండు మారుతూ ఉండటం వలన ఇది సాధ్యమైంది. యూట్యూబ్ లో చారిత్రక ప్రదేశాలు .. కోటలను గురించే కాదు, తమ అభిమాన నటీనటులు ఎలాంటి ఇళ్లలో ఉంటున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా చాలామంది ఉత్సాహాన్ని చూపుతుంటారు. ఈ కారణంగానే యూ ట్యూబ్ లో ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్న వీడియోలలో 'హోమ్ టూర్' టాప్ ప్లేస్ లో ఉంది. ఇటీవలే యూ ట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ అలీ భార్య 'జుబేదా' తమ ఇంటికి సంబంధించిన 'హోమ్ టూర్' వీడియోను తాజాగా రిలీజ్ చేసింది.

అలీ .. జుబేదా ఇద్దరూ కూడా తమ ఇంటిని పరిచయం చేశారు. తన మొదటి సినిమా 'సీతాకోక చిలుక' నుంచి, ఆయా సందర్భాల్లో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. చిరూ .. పవన్ .. దాసరి నారాయణరావుతో దిగిన ఫొటోలను అలీ చూపించారు. ఆయా సినిమాలకి గాను తనకి వచ్చిన అవార్డులను .. తాను సాధించిన విజయాలకు కారణమైన తల్లిదండ్రుల ఫొటోలను చూపించారు. అలాగే 'అలీ 360' .. 'ఆలీతో సరదాగా' షోస్ కి సంబంధించిన జ్ఞాపకాలుగా తీసిన ఫొటోలను గురించి చెప్పారు. తనకి జరిగిన సన్మానాలు .. ప్రశంసా పాత్రలను గురించి వివరించారు.

ఇక జుబేదా కిచెన్ మొదలు తమ ఇంట్లోని ప్రతి రూమ్ కి తిరుగుతూ .. తాము దగ్గరే ఉండి ఎలా డిజైన్ చేయించుకున్నది చెప్పుకొచ్చారు. జిమ్ .. యోగా రూమ్ .. ఇండోర్ గేమ్ .. స్విమ్మింగ్ పూల్ ను అలీ దంపతులు ఏర్పాటు చేసుకున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రతి విషయంలో అలీ దంపతులు తీసుకున్న శ్రద్ధ .. జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యాంగా ఉండాలంటూ వాళ్లు చెప్పిన తీరు ఈ వీడియో చూసినవారిని ఆకట్టుకుంటుంది. కెరియర్ పరంగానే కాదు .. ఫ్యామిలీని చక్కబెట్టుకునే విషయంలోనూ అలీ ప్లానింగ్ కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.