`సినిమా బండి` సాంగ్: సంకనాకిపోయినా సినిమా తీస్తం!

Fri May 07 2021 19:57:24 GMT+0530 (IST)

'cinema Bandi' Song: Sankinakipoyina cinema Teestam!

ఏదైనా కొత్తదనం లేనిదే సినిమాలు చూసే రోజులు కావివి. స్టార్ డమ్ లేకపోయినా కొత్తదనం ప్రయోగాత్మకత చాలా అవసరం. కంటెంట్ డ్రివెన్ సినిమాల హవా నడుస్తోంది. ఈ కేటగిరీలో చాలా చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ సాధిస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ లతో పని లేకుండా ఓటీటీ బిజినెస్ ఉంది కాబట్టి చిన్న సినిమాల్లో కంటెంట్ ఉన్నవాటికి ఇబ్బంది ఏమీ లేదు.తాజాగా సినిమా బండి నుంచి సినిమా తీసినం .. లిరికల్ సాంగ్ విడుదలైంది. అన్నం ఉడికిందో లేదో చెప్పేందుకు ఒక మెతుకు చాలని అంటారు. ఈ సాంగ్ లో ఉపయోగించిన పదజాలం తెలంగాణ యాస ప్రయోగాత్మకత ప్రతిదీ ఇట్టే కనెక్టయిపోతాయి. అంత అందంగా ఉత్తేజ్ తెలంగాణ యాక్సెంట్ తో ఈ సాంగ్ జాతీయ అవార్డుల సినిమా `గల్లీ బోయ్` థీమ్ నే తలపిస్తోంది. సైలెంటుగా ర్యాప్ మిక్స్ చేసి పడికట్టు పదాలతో ఎంతో చక్కని లిరిక్ ని రాశారు. ఈ నెల 14 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇది 5డి కెమెరాతో తీసిన సినిమా.

అయితే ఆ కెమెరాను ఎలా ఉపయోగించాలో తెలియని సినిమా బండి బ్యాచ్ ...మొత్తానికి అదే కెమెరాతో ఓ సినిమా ఎలా తీశారో చూపిస్తూ.. ఎంతో ఫన్ తో ఆద్యంతం రక్తి కట్టిస్తున్నారు. ఇంతకుముందు రిలీజైన ట్రైలర్ లక్షలాది వ్యూస్ ని అందుకుంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో ప్రవీణ్.కె దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజయ్ దేవరకొండ-సిద్ధార్థ్ వర్మ-రోహిత్ కొప్పు-వసంత్ మరింగ-శ్రీనుబాబు ముసిమి తదితరులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.