చరణ్ డైలమా.. ఫ్యాన్స్ కు ఏం చెప్పాలో ఏమిటో!

Wed Jul 08 2020 10:00:13 GMT+0530 (IST)

charan fans wants an update on his next

సీక్వెన్స్.. కాన్ సీక్వెన్స్ ప్రతిదీ ఎదుర్కోవాల్సిందే. డిస్ట్రబ్ అయితే ఆ పర్యవసానం ఎలా ఉంటుందో చెర్రీని చూస్తే అర్థమైపోతుంది. అతడు ప్రస్తుతం ఫ్యాన్స్ కి ఏం సమాధానం ఇవ్వాలో తెలీని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణను ఈపాటికే ముగించి తదుపరి కొరటాల శివ తెరకెక్కించనున్న ఆచార్య సెట్స్ కి వెళ్లాలని అనుకున్నారు. కానీ మహమ్మారీ వ్యాప్తి వల్ల అది సాధ్యపడడం లేదు.పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ అంతకంతకు ఆలస్యమవుతుంటే ఆచార్యకు లైన్ క్లియర్ కావడం లేదు. దాదాపు 30 రోజుల కాల్షీట్లను కొరటాల కోసం కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఇప్పట్లో జక్కన్న తో ఆ పని అయ్యేట్టు లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఆర్.ఆర్.ఆర్ చిత్రం 2020లో పూర్తయి 2021లో రిలీజవుతుందా లేదా అన్న సందేహం వ్యక్తమవుతోంది. మహమ్మారీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి అయినా వదిలి పెడుతుందా? అన్న సందిగ్ధత ఇంకా పరిశ్రమలో అలానే ఉంది.

అందుకే ప్రస్తుత పాన్ ఇండియా మూవీ తరువాత చరణ్ ఏ సినిమాలో నటిస్తారు? అన్నదానిపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. కొరటాలకు కాకుండా వేరొక దర్శకుడు ఎవరికైనా చరణ్ కాల్షీట్లు ఇచ్చారా? అన్నది తేలాల్సి ఉంటుంది. ప్రస్తుతం  ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిందిగా సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ అడిగేస్తుంటే చరణ్ నుంచి సమాధానం అయితే లేదు.