Begin typing your search above and press return to search.

దయచేసి వ్యక్తిగత ప్రశ్నలు వ‌ద్దు

By:  Tupaki Desk   |   16 Sep 2021 5:37 AM GMT
దయచేసి వ్యక్తిగత ప్రశ్నలు వ‌ద్దు
X
స‌మంత అక్కినేని త‌న ఇన్ స్టా.. సోష‌ల్ మీడియాల నుంచి అక్కినేని తొల‌గించి `ఎస్` అనే అక్ష‌రంతో రీప్లేస్ చేసిన‌ప్ప‌టి నుంచి మీడియాలో ర‌క‌ర‌కాల ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. సామ్ ఆక‌స్మిక నిర్ణ‌యం వెన‌క ఏదో జ‌రుగుతోంది అంటూ పుకార్లు షికార్ చేశాయి. దీనిపై గాసిప్స్ వ‌స్తుంటే సామ్ త‌న‌దైన శైలిలో వ్యంగ్యంగా స్పందించ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. మ‌రి ఈ పుకార్లు గాసిప్పుల విష‌యంలో చైత‌న్య స్పంద‌న ఎలా ఉంది? అంటే... ఇప్ప‌టికి చైతూ సైలెన్స్ ప్లీజ్! అనేస్తున్నాడు.

నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడానికి నిరాకరిస్తున్నారు. `లవ్ స్టోరీ` ప్ర‌చారంలో భాగంగా మీడియా ఇంటర్వ్యూల్లో.. వ్య‌క్తిగ‌త ప్ర‌శ్న‌లు వ‌ద్ద‌ని క్లారిటీగా చెబుతున్నారు. త‌న‌పై వ‌చ్చే ఏ పుకార్ల‌కు అత‌డు స్పందించేందుకు ఆస‌క్తిగా లేడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ప్ర‌శ్న ఏదైనా తన కెరీర్ కు కట్టుబడి ఉండాలని ఆయన మీడియాను అభ్యర్థిస్తున్నారు.

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పూర్తి నిశ్శబ్ధాన్ని పాటిస్తున్నాడు.

సెప్టెంబర్ 24 న ల‌వ్ స్టోరి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై నాగ చైతన్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. త్వరలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా అతను హాజరు కానున్నాడు. ల‌వ్ స్టోరిని పెద్ద హిట్ చేయాల‌ని చైతూ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ల‌వ్ స్టోరి విజ‌యంపై క‌మ్ముల‌.. సాయిప‌ల్ల‌వి ధీమాగానే ఉన్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రంలో చైత‌న్య‌-ప‌ల్ల‌వి ల‌వ్ ఇంటెన్సిటీ.. సాయిప‌ల్ల‌వి డ్యాన్సుల దుమారం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానున్నాయి.

మాటిచ్చి థియేట‌ర్ల‌కే క‌ట్టుబ‌డిన నిర్మాత‌

క‌రోనా మ‌హ‌మ్మారీ వేళ‌ ఓటీటీల జోరుతో థియేట్రిక‌ల్ రంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పేరున్న నిర్మాత‌లే త‌మ సినిమాల‌ను ఓటీటీల‌కు అమ్ముకుంటుంటే చిన్నా చితకా నిర్మాత‌లు అదే దారిని అనుస‌రించాల్సిన ప‌రిస్థితి ఉంది. దీనివ‌ల్ల థియేట‌ర్ల రంగం స‌ర్వ‌నాశ‌నం అవుతుంద‌ని ఎగ్జిబిట‌ర్లు పంపిణీదారులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఏషియ‌న్ సునీల్ నారంగ్ ఈ విష‌యంలో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పెద్ద నిర్మాత‌లు సంయ‌మ‌నం పాటించ‌డం లేద‌ని అక్టోబ‌ర్ చివ‌రి వ‌ర‌కూ వేచి చూడాల‌ని ఆయ‌న కోరారు. కంగారు ప‌డి ఓటీటీల‌కు సినిమాల‌ను అమ్ముకుంటే ఎగ్జిబిష‌న్ రంగం పంపిణీ రంగం స‌ర్వ‌నాశ‌నం అవుతాయ‌ని నారంగ్ అన్నారు.

అంతేకాదు.. తాను చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి త‌మ సినిమాని ఓటీటీకి అమ్ముకోలేద‌ని తెలిపారు. నాగ‌చైత‌న్య‌- సాయి ప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరిని కొనుగోలు చేసేందుకు ఓటీటీల నుంచి ప‌ది భారీ ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని కానీ తాము తిర‌స్క‌రించామ‌ని నారంగ్ తెలిపారు. ఓటీటీలకు నిర్మాత‌లు ఎవ‌రూ సినిమాల్ని అమ్మొద్ద‌ని తెలంగాణ ఛాంబ‌ర్ త‌ర‌పున‌ ఏషియ‌న్ సునీల్ నారంగ్ అర్థించారు. గ‌డువు కూడా ఇచ్చారు.

నేనూ నిర్మాత‌నే.. నిర్మాతల బాధ నాకు తెలుసు కానీ ఎగ్జిబిటర్లు ఎక్కువగా క‌ల‌త చెందుతున్నారు. నా చిత్రం `లవ్ స్టోరీ`కి OTT నుండి పది భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ సినిమాను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను.. అని సునీల్ నారంగ్ తెలిపారు. ఎగ్జిబిట‌ర్లు పంపిణీదారులను కాపాడాల్సిన అవ‌స‌రం నిర్మాత‌ల‌కు ఉంద‌ని అన్నారు. నిజానికి కోవిడ్ సెకండ్ వేవ్ కి ముందే ల‌వ్ స్టోరి థియేట్రిక‌ల్ రిలీజ్ కి రెడీ అయ్యింది. కానీ అనూహ్యంగా కరోనా విజృంభ‌ణ‌తో ప్ర‌ణాళిక త‌ల‌కిందులైంది. అయినా త‌న సినిమాని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేందుకు నారంగ్ క‌ట్టుబ‌డి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు.